నితిన్‌-త్రివిక్ర‌మ్‌ని నిరాశ ప‌రిచిన బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్‌..!

nitin

టాలీవుడ్‌లోనే ది మోస్ట్ అవైటింగ్ మూవీ బాహుబ‌లి 2. భారీ అంచ‌నాలున్న చిత్రం ఇది. దేశంలో ఇంత‌వ‌ర‌కు విడుద‌ల‌కు ముందు ఏ మూవీకి జ‌ర‌గ‌నంత బిజినెస్ బాహుబ‌లి 2కే జ‌రుగుతోంది. దాదాపు 400 కోట్ల బిజినెస్ జ‌రుగుతోంది ఈ చిత్రం. రీసెంట్‌గా ఈ సినిమాకి సంబంధించి బిగ్ ఈవెంట్ జ‌రిగింది. అదేంటంటే… బాహుబ‌లి 2లో ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేశాడు. ముంబైలోని మామి ఫెస్టివ‌ల్‌లో జ‌రిగిన ఈ ఆడియో ఫంక్ష‌న్‌ గ్రాండ్‌గా జ‌రిగింది. ఇదే ఇప్పుడు నితిన్‌-త్రివిక్ర‌మ్‌ని నిరాశ ప‌రిచింద‌ట‌.బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్‌ని మొద‌ట శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల‌కు విడుద‌ల చెయ్యాల‌ని ప్లాన్ చేశారు.

కానీ, వాయిదా ప‌డుతూ ప‌డుతూ అది చివ‌రికి 5.30కి పోస్ట్‌పోన్ అయింది. స‌రిగ్గా ఇదే టైమ్‌లో జీ తెలుగు చానెల్‌లో.. నితిన్‌-త్రివిక్ర‌మ్ లేటెస్ట్ మూవీ అ.. ఆ.. టెలికాస్ట్ అయింద‌ట‌. దీంతో, బాహుబ‌లి 2ని జాతీయ‌, లోక‌ల్ మీడియా క‌వ‌ర్ చెయ్య‌డంతో అంద‌రూ దానినే చూశార‌ట‌. దీంతో, త్రివిక్ర‌మ్‌-నితిన్ మూవీ టీఆర్పీ రేటింగ్స్ కాస్త డౌన్ అయ్యే చాన్స్ ఉంద‌ని భావిస్తున్నార‌ట‌. అదే ముందుగా ఫిక్స్ చేసిన 4 గంట‌ల స‌మ‌యానికే రిలీజ్ చేసినట్ల‌యితే అ..ఆ..ప్రీమియ‌ర్‌షోకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాద‌ని.. కానీ, ఇలా బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ ఈవెంట్ నితిన్‌-త్రివిక్ర‌మ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిందంటున్నారు.

త్రివిక్ర‌మ్ సినిమాల‌కు బుల్లితెర‌పై ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆయ‌న ఫ్లాప్ చిత్రాల‌కు కూడా స్మాల్ స్క్రీన్‌పై భారీ రేటింగ్స్ వ‌స్తాయి. టీఆర్పీలో ఇత‌ర సినిమాల‌కంటే ఎంతో ముందుంటాయి మాట‌ల మాంత్రికుడు చిత్రాలు. అత‌డు సినిమా ఇప్ప‌టికీ ఎప్పుడు టెలికాస్ట్ చేసినా భారీ రేటింగ్ ద‌క్కించుకుంటుంది. ఇక‌, థియేట‌ర్ల ద‌గ్గ‌ర అంత‌గా ఆద‌ర‌ణ ద‌క్కించుకోని ఖ‌లేజాకి కూడా స్మాల్ స్క్రీన్‌పై మంచి రేటింగ్ వ‌చ్చింది. మ‌రి, బాహుబ‌లి 2 పోస్టర్ రిలీజ్ ప్ర‌భావం.. నితిన్‌-త్రివిక్ర‌మ్ అ.. ఆ.. టీఆర్పీల‌పై ఎలా ఉంటుందో చూడాలంటే మ‌రో వారం రోజులు వెయిట్ చెయ్య‌క‌త‌ప్ప‌దు.

Loading...

Leave a Reply

*