ఆ యువ రాజ‌కీయ వేత్త‌తో కాజ‌ల్ డేటింగ్‌.. త్వ‌ర‌లోనే మ్యారేజ్‌..?

kajal

ఇదో షాకింగ్ న్యూస్‌. బంతిపూల జాన‌కి ఓ యువ పొలిటీషియ‌న్‌తో డేటింగ్ చేస్తోంద‌నే ప్ర‌చారం బాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. గ‌త కొంత‌కాలం నుంచి కాస్త సీక్రెట్‌గా సాగుతున్న ఆ అఫైర్‌.. రీసెంట్‌గా కాస్త శృతి మించిందని, ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వీరు క‌నిపిస్తున్నార‌నే టాక్ సాగుతోంది. ముంబై మీడియా ఫోక‌స్ కాజ‌ల్ ల‌వ్ అఫైర్‌పైనే స్టోరీలు వండి వారిస్తున్నాయ‌ట‌.

ఆ యువ పొలిటీషియ‌న్‌కు 40 ఏళ్ల వ‌య‌సు ఉంటుంద‌ట‌. నాలుగు ప‌దుల‌కు రీచ్ అయినా అత‌ను ఇంకా మ్యారేజ్ చేసుకోలేదట‌. ప్ర‌స్తుతం డేటింగ్‌లో ఉన్న ఈ ఇద్ద‌రూ త్వర‌లోనే ఓ ఇంటి వారు కాబోతున్నార‌నే రూమర్ వినిపిస్తోంది. అయితే, ఓ జాతీయ పార్టీకి చెందిన యువ రాజ‌కీయ వేత్త అని, రాజ‌కీయంగా కూడా ఆ యువ‌నేత కుటుంబానికి మంచి ప‌లుకుబ‌డి, పేరు, ప్ర‌తిష్ట ఉంద‌ని స‌మాచారం.

కొన్నాళ్ల క్రితం ఓ బాలీవుడ్ పార్టీలో కాజ‌ల్‌కి అత‌నితో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ట‌. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య మాట మాట క‌లిసి.. ఆ అనుబంధం ప్రేమ‌గా మారింద‌ట‌. రీసెంట్‌గా డేటింగ్‌లో ఉన్నార‌ని, ఇటు ఇరు కుటుంబాల పెద్ద‌ల‌కు కూడా మేట‌ర్ లీక్ అయింద‌ని, కాజ‌ల్ త‌ల్లిదండ్రుల‌కు ఈ సంబంధం ఓకే అయినా.. అబ్బాయి త‌ర‌ఫునుంచి ఇంకా ప‌క్కా క్లారిటీరాలేద‌ని తెలుస్తోంది. గ‌త కొంత‌కాలంగా ఆమె ఓ యువ బిజినెస్‌మేన్‌తో ప్రేమ‌లో ఉంద‌నే మేట‌ర్ వార్త‌ల‌కెక్కింది. కానీ, అది అబ‌ద్ద‌మ‌ట‌. ఆయ‌న యువ పొలిటీషియ‌న్ అని స‌మాచారం. మ‌రి, కాజ‌ల్ కూడా వ‌చ్చే ఏడాది స్టార్టింగ్‌లోనే పెళ్లికి బాజా మోగిస్తుందా? లేదా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*