షాకింగ్‌.. లీక్ అయిన శాత‌క‌ర్ణి టీజ‌ర్‌..టీజ‌ర్ ఎలా ఉందంటే…..!

balaya

నంద‌మూరి అభిమానుల‌కు ఇది ఓ బ్యాడ్ న్యూస్‌. గుడ్ న్యూస్ కూడా. అదేంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే ఉంది అస‌లు తిర‌కాసు.. గుడ్ న్యూస్ ఏంటంటే.. విజ‌య ద‌శ‌మి కానుక‌గా బాల‌య్య తాజా చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి మూవీ టీజ‌ర్‌ని విడుద‌ల చెయ్యాల‌ని ప్లాన్ చేశారు. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. రేపు ఉదయం ప‌ది గంట‌ల‌కు శాత‌క‌ర్ణి టీజ‌ర్‌ని యూ ట్యూబ్‌లో పెట్టేలా స్కెచ్ గీశారు. కానీ, అది లీక్ అయింద‌ట‌. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్ ఇప్పుడు ఫ్యాన్స్ సెల్ ఫోన్‌ల‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యూ ట్యూబ్‌లో ప్ర‌స్తుతం దీనిదే హంగామా.24 గంట‌ల ముందే టీజ‌ర్ రిలీజ్‌ని వీక్షించ‌డం అభిమానుల‌కు గుడ్ న్యూస్ అయితే.. అది లీక్ అవ‌డం మాత్రం వారిని నిజంగా టెన్ష‌న్ పెట్టేదే. ఎందుకంటే.. రేపు థియేట‌ర్ ట్రయిల‌ర్‌తోపాటు, సినిమా కూడా లీక్ అయితే.?

ఈ ప్ర‌శ్నే ఇప్పుడు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను టెన్ష‌న్ పెడుతోంద‌ట‌. అయితే, టీజ‌ర్ అద్భుతంగా ఉంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. విజువ‌ల్స్ అద్భుతంగా వ‌చ్చాయంటున్నారు. వార్ సీన్‌ల‌లో డైరెక్ట‌ర్ క్రిష్ త‌న త‌డాఖా చూపించాడంటున్నారు. మ‌రోవైపు, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి.. మ‌ర‌ణ‌మా.. శ‌ర‌ణ‌మా..? డైలాగ్ విన్న అభిమానులు కిర్రెక్కి పోతున్నారు. సినిమాపై అంచ‌నాలు అమాంతం పెంచేలా ఉన్నాయని చెబుతున్నారు. ఇది బాహుబ‌లిలో కాల‌కేయుడుతో యుద్ధ స‌న్నివేశానికి ముందు బాహుబ‌లి చెప్పిన డైలాగ్‌ని గుర్తుకు తెస్తుంద‌ని కొంద‌రంటుంటే.. మ‌రికొంద‌రు దానిని త‌ప్పు ప‌డుతున్నారు.

ఈ ఒక్క డైలాగ్‌తో దానిని ఎలా చెబుతార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.గౌత‌మీపుత్ర శాత‌కర్ణి… బాల‌య్య కెరీర్‌లోనే ప్రిస్టీజియ‌స్ చిత్రం. ఆయ‌న కెరీర్‌లో ఇది వందో చిత్రం. అందుకే, ఈ సినిమాని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. అయితే, శాత‌క‌ర్ణి టీజ‌ర్ లీక్ కాలేదని, ఇది ఫ్యాన్ మేడ్ టీజ‌ర్ అని చెబుతున్నారు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే.. టీజ‌ర్‌లో విజువ‌ల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఇది నిజ‌మో అబద్ధ‌మో మ‌రికొన్ని గంట‌ల్లోనే తేల‌నుంది.

Loading...

Leave a Reply

*