క‌ల‌ర్స్ స్వాతికి మ్యారేజ్ సెట్ అయింది.. వ‌రుడు అత‌నే అంటూ పుకార్లు..!

swathi-reddy

స్వాతిరెడ్డి అలియాస్ క‌ల‌ర్స్ స్వాతికి మ్యారేజ్ సెట్ అయిందా? ఆమె త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతోందా..? టాలీవుడ్‌లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గ‌త కొంత‌కాలంగా స్వాతి ఎన్నో అఫైర్‌లు న‌డిపిందంటూ రూమ‌ర్‌లు పుట్టుకొచ్చాయి. తెలుగు చిత్ర‌సీమ‌తోపాటు త‌మిళ్‌లోని కొంద‌రు యువ హీరోల‌తో ఆమె ప్రేమాయ‌ణం న‌డిపింద‌రే పుకార్లు కూడా వినిపించాయి. వీటితోపాటు ఆమె త్వ‌ర‌లోనే పెళ్లి కాబోతోంద‌నే ప్ర‌చారం కూడా కొత్త కాదు.

అయితే, గ‌త కొంత‌కాలంగా తెలుగులో సింగిల్ చాన్స్ లేని స్వాతికి కుటుంబస‌భ్యులు పెళ్లి చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. దీంతో, ఓ వ‌రుడిని కూడా ఫైన‌లైజ్ చేసిన‌ట్లు స‌మాచారం. చెన్నైకి చెందిన ఓ బిజినెస్ మాగ్నెట్‌తో ఆమె త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతోందనే గాసిప్ వినిపిస్తోంది. పెద్ద‌లు చూసిన మ్యాచ్ అన్ని విధాలా న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట స్వాతి..

రీసెంట్‌గా ఆమెకు స‌రైన చాన్స్‌లు రాలేదు. గతేడాది విడుద‌ల‌యిన త్రిపుర త‌ర్వాత ఆమె లైమ్‌లైట్‌లోకి రాలేదు. అంత‌కుముందు తెలుగులో స్వామిరారా, కార్తికేయ వంటి చిత్రాలతో హిట్ అందుకున్న ఈ భామ‌.. స‌డెన్‌గా డ‌ల్ అయింది. గీతాంజ‌లి వంటి సక్సెస్‌ఫుల్ ఫిల్మ్‌కి సీక్వెల్‌గా వ‌చ్చిన త్రిపుర ఆశించిన రేంజ్‌ని అందుకోలేక‌పోయింది. దీంతో, ఆమెకు క్రేజ్ త‌గ్గింది. ఇటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, బాలీవుడ్ నుంచి వ‌స్తున్న కొత్త భామ‌లు కూడా క‌ల‌ర్స్ స్వాతిని ఇమేజ్‌ని త‌గ్గించేశారు. యువ ద‌ర్శ‌కుల ఫోక‌స్ కూడా వారిపైనే ప‌డింది. ఎంతో టాలెంట్ ఉండి కూడా క‌ల‌ర్స్ స్వాతి కెరీర్ గ్రాఫ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది.

అయితే, కెరీర్ డౌన్ అయిన హీరోయిన్‌లు మ్యారేజ్ చేసుకోబోతున్నార‌నే పుకార్లు రావ‌డం సహజం. ఇది కూడా అలాంటిదేనా..? లేక‌, నిజ‌మైన వార్త అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Loading...

Leave a Reply

*