షాకింగ్‌.. ధృవ టీజ‌ర్ డైలాగ్‌.. ఆ మెగా హీరోపైనే..!

untitled-1314

టాలీవుడ్‌లో ఒక ఫ్యామిలీ హీరోల‌పై మ‌రో ఫ్యామిలీ హీరోలు డైలాగ్‌లు పేల్చ‌డం సాధార‌ణం. మెగా వ‌ర్సెస్ నంద‌మూరి ఫ్యామిలీ హీరోల మ‌ధ్య ఈ డైలాగ్ వార్ ఎప్ప‌టినుంచో న‌డుస్తోంది. ఇది వెరీ కామ‌న్‌. మొన్నామ‌ధ్య సింహా సినిమాలో బాల‌య్య వ‌దిలిన బుర‌దజాతి డైలాగ్ భారీ ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ఆ త‌ర్వాత ర‌చ్చ మూవీలో చెర్రీ సింహా డైలాగ్‌లకి రివ‌ర్స్ పంచ్‌లు వేశాడ‌నే టాక్ వినిపించింది. వీటిని ప‌క్క‌న‌పెడితే.. తాజాగా ధృవ టీజ‌ర్‌లోని డైలాగులు మెగా ఫ్యామిలీలోని మ‌రో హీరోపైనే అనే చ‌ర్చ హాట్ హాట్‌గా సాగుతోంది.

ధృవ టీజ‌ర్ చూశారా…? అందులో డైలాగ్‌లు ప‌ర్‌ఫెక్ట్‌గా విన్నారా..? టీజ‌ర్‌లో డైలాగులు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి టాలీవుడ్‌లో.
నీ స్నేహితుల్ని చూస్తే నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది. అదే నీ శత్రువులు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది.. ఇదీ ఆ డైలాగ్‌. ఈ డైలాగ్ ఇప్పుడు మెగా హీరోని టార్గెట్ చేసిన‌వే అని టాలీవుడ్‌లో డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. ఇది అబ‌ద్ధ‌మో నిజమో కానీ.. కావాల‌నే చెర్రీ టీమ్ నుంచి ఇలాంటి ఫీల‌ర్‌లు వ‌స్తున్నాయ‌ని, వారే లీక్‌లు ఇస్తున్నార‌ని చ‌ర్చ కూడా సాగుతోంది.

నిన్న‌మొన్న‌టిదాకా త‌న తండ్రి ఇమేజ్‌ని అడ్డు పెట్టుకొని రెయిజ్ అయిన ఆ హీరో.. తాజాగా త‌మ‌ను తొక్కేస్తున్నాడ‌నే భావ‌న‌లో ఉన్నాడ‌ట రామ్‌చ‌ర‌ణ్‌. త‌న సినిమాల‌కు ముందుగానే నెగిటివ్ ప‌బ్లిసిటీ ఇప్పించ‌డంతోపాటు ఆ మెగా హీరో సినిమాలు ఫ్లాప్ అయినా సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ చెయ్య‌డంతో చెర్రీకి బాగా కాలింద‌ట‌. ధృవ సినిమాకి ప‌నిచేస్తున్న ఆ హీరో టీమ్‌ని… త‌ప్పించాడ‌ని, వారి ప్లేస్‌లో వేరేవారికి ఆ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అందుకే, ధృవ టీజ‌ర్‌లో నీ స్నేహితుల‌ని చూస్తే నీ క్యారెక్ట‌ర్ ఏంటో తెలిసిపోతుంది. అదే నీ శ‌త్రువులు ఎవ‌రో తెలిస్తే నీ కెపాసిటీ ఏంటో అర్ధం అవుతుంది.. ఈ డైలాగ్‌ని కావాల‌నే చెర్రీ పెట్టించి.. వారిపై యుద్ధ‌భేరి మోగించాడ‌నే గాసిప్ షురూ అయింది టాలీవుడ్‌లో. ఇక‌పై శ‌ర‌ణ‌మా.. ర‌ణ‌మా తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం ఆ హీరో వ‌ర‌స విజ‌యాల‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడ‌ట‌. మ‌రి, చెర్రీ త‌న ఓన్ కాంపౌండ్‌లోని హీరోని త‌ట్టుకొని నిల‌బ‌డ‌గ‌ల‌డా? లేదా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*