బ‌న్ని దువ్వాడ జ‌గ‌న్నాధ‌మ్ స్టోరీ.. ప‌వ‌న్ త‌మ్ముడుకి కాపీనా..?

is-bunny-duvvada-jagannadham-copy-to-pavan-tammudu

అల్లు అర్జున్ త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమాకు దువ్వాడ జగన్నాధమ్-డీజే అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే సినిమా సెట్స్ పైకి రాకముందే డీజే సినిమాకు లీకేజీకు లీకేజీల గొడవ ఎక్కువైంది. ఈ సినిమాలో బన్నీ గెటప్ ఇదేనంటూ ఈమధ్య ఓ ఫొటో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ ఫొటోనే నెట్ లో రౌండ్స్ కొడుతోంది. తాజాగా ఇప్పుడు మరో లీకేజీ కూడా బయటకొచ్చింది.

బన్నీ కొత్త సినిమా డీజే స్టోరీలైన్ ఇదేనంటూ ఓ ప్రచారం ఊపందుకుంది. తాజా సమాచారం ప్రకారం… పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు సినిమాకు దగ్గరగా బన్నీ డీజే ఉండబోతోందని తెలుస్తోంది. తమ్ముడులో పవన్ పేరు సుబ్రమణ్యం. దాన్ని పవన్ సుభాష్ మార్చుకుంటాడు. డీజేలో కూడా దువ్వాడ జగన్నాధమ్ పేరును బన్నీ డీజేగా మార్చుకుంటాడని తెలుస్తోంది. అటు సినిమా కూడా తమ్ముడు టైపులోనే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రాబోతుందట.

ప్రస్తుతమైతే ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ చాలా సోషల్ మీడియా వేదికల్లో ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఆ స్టోరీకి లైకులు, షేర్లు కూడా పెరిగిపోయాయి. అయితే అసలైన డీజే స్టోరీ అదేనా కాదా అనేది మాత్రం సందేహం. అటు ఈ సినిమా స్టోరీలైన్ గురించి మాట్లాడ్డానికి హరీష్ శంకర్ అస్సలు ఒప్పుకోవడం లేదు. బన్నీ అయితే కనిపించడమే మానేశాడు.

 

Loading...

Leave a Reply

*