బాహుబ‌లి 2 ఫ‌స్ట్‌ లుక్‌.. ఆ సినిమా పోస్ట‌ర్‌కి కాపీనా..?

baabhubali-2

రాజ‌మౌళి సినిమా అంటే చాలు… కాపీ అనే కామెంట్స్ చేస్తుంటారు కొంద‌రు. ఆయ‌న సినిమాకి సంబంధించి ఏద‌యినా రిలీజ్ అయిందంటే చాలు.. దానికి సంబంధించి వెంట‌నే కాపీలు ఉన్నాయా? అంటూ నెట్‌లో సెర్చింగ్‌లు మొద‌లు పెడ‌తారు కొంద‌రు. ఈగ ఫ్లై చిత్రానికి కాపీ అని, ఇక‌, మ‌ర్యాద‌రామ‌న్న మూవీ మ‌రో హాలీవుడ్ సినిమాకి మ‌క్కీకి మ‌క్కీ దించేశాడ‌నే టాక్స్ వినిపించాయి. ఇక‌, బాహుబ‌లి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌యిందో లేదో…. విమ‌ర్శ‌కులు రెచ్చిపోయారు. ర‌మ్య‌కృష్ణ చేతితో బిడ్డ‌ను ఎత్తుకునే పోస్ట‌ర్‌..ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వెంట‌నే నెట్‌లో హంగామా క్రియేట్ చేశారు.

వీట‌న్నింటికంటే రాజ‌మౌళి అతి పెద్ద విమ‌ర్శ‌ల‌ను ఫేస్ చేసింది ఎక్క‌డంటే…. బాహుబ‌లి టీజ‌ర్‌కి సంబంధించి వాడిన టెంప్లేట్‌పై. అది నెట్‌లో కేవ‌లం 20 డాల‌ర్‌ల‌కు కొని అదే టెంప్లేట్‌లో మ్యూజిక్‌ని కాస్త మార్చి రిలీజ్ చేశార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మొద‌ట దీనిని జ‌క్క‌న్న కొట్టివేసినా.. ఆత‌ర్వాత అది అంగీక‌రించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో, బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అవుతుంద‌నగానే మొద‌ట అంద‌రూ లుక్ కోసం వెయిట్ చేశారు. ఆ త‌ర్వాత నెట్‌లో మ‌రో విండోని ఓపెన్‌గా పెట్టుకున్నారు. అది ఏ సినిమాదో సెర్చ్ చెయ్య‌డానికి.

కానీ, బాహుబ‌లి 2 మాత్రం ఈ సారి రాజ‌మౌళి ఓన్ స్ట‌యిల్‌లోనే రిలీజ్ చేశాడు. ఇది ప‌క్కాగా రాజ‌మౌళి క్రియేట్ చేసిందే. సిక్స్ ప్యాక్ బాడీతో ఓ చేతిలో క‌త్తి మ‌రో చేతిలో సంకెళ్ల‌తో వ‌స్తున్నాడు. ఇది మ‌రో మూవీ పోస్ట‌ర్‌కి కాద‌ని, కేవ‌లం ప‌క్కా ఒరిజినల్ అని క్లియ‌ర్‌గా అర్ధ‌మ‌వుతుంది. ఇలా, చాలా గ్యాప్ త‌ర్వాత విమ‌ర్శ‌కుల‌కు చెక్ చెప్పాడు రాజ‌మౌళి. ఆయ‌న ఇప్పుడు అంత‌ర్జాతీయ స్థాయి ద‌ర్శ‌కుడు. మ‌రి, ఈ మాత్రం కేర్ తీసుకోక‌పోతే. అదీ ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్‌లో ఈ లుక్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న‌ప్పుడు ఇలా చేస్తాడా..? అందుకే, ద‌టీజ్ రాజ‌మౌళి అనిపించాడు.

Loading...

Leave a Reply

*