క‌ల్యాణ్‌రామ్ టాట్టూ వెనుక ఇంట‌రెస్టింగ్ ల‌వ్ స్టోరీ..!

kalyanram

మీరు రీసెంట్‌గా క‌ల్యాణ్‌రామ్ ఇజం ఆడియో ఫంక్ష‌న్ చూశారా..? ఆ ఈవెంట్‌లో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది ఎన్టీఆర్ ఫ్యామిలీ అనుబంధం. హ‌రికృష్ణ‌-ఎన్టీఆర్‌తో చెబుతున్న ముచ్చ‌ట్లు హైలైట్‌గా నిలిచాయి. ఇక‌, అన్న‌య్య క‌ల్యాణ్‌రామ్ త‌న‌కు బ్ర‌ద‌రే కాదు, మార్గ‌ద‌ర్శి, ల‌వ‌ర్, గాళ్ ఫ్రెండ్ అంటూ తార‌క్ చెప్పిన క‌బుర్లు కూడా ఫ్యాన్స్‌ని క‌ట్టిప‌డేశాయి. వారి హృద‌యాన్ని త‌డిమాయి. వీటితోపాటు ఆ రోజు అంద‌రినీ అట్రాక్ట్ చేసిన మ‌రో ఎలిమెంట్‌.. క‌ల్యాణ్ రామ్ చేతిపై ఉన్న ప‌చ్చ‌బొట్టు.కుడిచేతి మ‌ణిక‌ట్టు కింద పెద్ద పెద్ద తాటికాయంత అక్ష‌రాల‌తో క‌నిపిస్తోంది ఆ పేరు. కాస్త ఫోటోలో జూమ్ ఇన్ చేసే చూస్తే అది స్వాతి అని క్లియ‌ర్‌గా అర్ధం అవుతోంది. క‌ల్యాణ్‌రామ్‌కి-ఈ స్వాతి పేరుకి ఏంటి క‌నెక్ష‌న్ అని తీరా చూస్తే..స్వాతి ఎవ‌రో కాదు.. ఆయ‌న భార్య‌.

క‌ల్యాణ్‌రామ్‌-స్వాతిది ప్రేమ వివాహం. ఇద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొద‌ట వీరి ప్రేమ వివాహానికి పెద్ద‌ల నుంచి కాస్త వ్య‌తిరేక‌త వ్య‌క్తం అయింద‌ట‌. అయినా, దానిని క‌వ‌ర్ చేసుకొని వారి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు క‌ల్యాణ్‌రామ్‌-స్వాతి. ఆయ‌న‌కు భార్య అంటే బాగా ఇష్ట‌మ‌ట‌. అందుకే, ఆమె పేరునే ప‌చ్చ‌బొట్టుగా వేయించుకున్నాడ‌ట క‌ల్యాణ్‌రామ్‌.క‌ల్యాణ్‌రామ్‌కి ఇండ‌స్ట్రీలో మంచి పేరుంది. స‌క్సెస్ రేట్ ఎలా ఉన్నా మంచి మ‌నిషిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీకి మంచి ప్రియారిటీ ఇస్తాడ‌ట‌. కల్యాణ్‌రామ్ చాలామంది గుడ్ ఫ్యామిలీ మేన్ అని పిలుస్తుంటారట చిత్ర ప‌రిశ్ర‌మ‌లో. ఈ ప‌చ్చ‌బొట్టు సాక్షిగా ప్రూవ్ అయింది అంటున్నారు.

Loading...

Leave a Reply

*