ఇజం ఆడియోలో మధుర ఘట్టం

untitled-81

హరికృష్ణ అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం. పెద్దగా కలుసుకోకపోయినా… ఇద్దరి మధ్య ఎఫెక్షన్ చాలానే ఉంది. ఇజం ఆడియో ఫంక్షన్ లో ఈ విషయం మరోసారి రుజువైంది. కొడుకు ఎదుగుతుంటే ఏ తండ్రికైనా ఆనందమే. పైగా ఇండస్ట్రీ హిట్ కొడితే ఆ ఆనందం డబుల్ అవుతుంది. అందుకే ఇజం ఆడియో ఫంక్షన్ లో తారక్ ను చూడగానే హరికృష్ణ మొహం ఎల్ ఈ డీ లైట్ లా వెలిగిపోయింది. అటు తారక్ కూడా హరికృష్ణను చూడగానే పొంగిపోయాడు.కేవలం తండ్రిని కలవడానికే వచ్చాను అన్నట్టు బిహేవ్ చేశాడు ఎన్టీఆర్. ఆడియో ఫంక్షన్ స్టార్టింగ్ లోనే అందరికంటే ముందే వచ్చేసిన తారక్… తండ్రితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇద్దరూ కాసేపు నవ్వుతూ, ఇంకాసేపు సీరియస్ గా చర్చించుకుంటూ కనిపించారు.

ఒక టైమ్ లో స్టేజ్ పై ఏం జరుగుతుందో కూడా మరిచిపోయారు తండ్రీకొడుకులిద్దరూ. అంతలా తన్మయత్వంలో పడిపోయారు. తారక్ అప్ కమింగ్ మూవీ విశేషాల్ని హరికృష్ణ అడిగి తెలుసున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పెద్దకొడుకు కల్యాణ్ రామ్ పెట్టిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నటిస్తున్నాడో లేదో కూడా హరికృష్ణ కనుకున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మాతగా ఓ సినిమా చేయడానికి తారక్ ఒప్పుకున్నాడు. అయితే ఆ సినిమా ఎప్పుడనేది మాత్రం బయటపెట్టలేదు. హరికృష్ణతో మాత్రం ఆ డీటేయిల్స్ పంచుకున్నట్టు తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*