హైపర్ కు బాహుబలి దెబ్బ

ram-and-orabha

హైపర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది. మొదటి రోజు ఎబోవ్ యావరేజ్ టాక్ వచ్చింది. టోటల్ గా సినిమా బాగుందనే రివ్యూస్ వచ్చాయి. అంతా బాగానే ఉంది. ఈ రివ్యూస్ కు కాస్త మౌత్ పబ్లిసిటీ కూడా తోడైతే ఇంకా బాగుండేది. కానీ హైపర్ కు బాహుబలి దెబ్బేసింది. నిజానికి బాహుబలి విడుదలకాలేదు. కనీసం దాన్నుంచి ఒక్క మేకింగ్ వీడియా కూడా విడుదల కాలేదు. ఎట్ లీస్ట్ టీజర్, ఫస్ట్ లుక్ లాంటి హంగామా కూడా లేదు. కానీ బాహుబలి సినిమాతో హైపర్ కు బ్యాండ్ పడింది.

సరిగ్గా హైపర్ విడుదలైన రోజే బాహుబలి టీం ప్రెస్ మీట్ పెట్టింది. ఉదయం హైపర్ రిలీజైతే.. సాయంత్రానికి ప్రెస్ మీట్ సిద్ధమైంది. ఈ ప్రెస్ మీట్లో ప్రభాస్, రాజమౌళి, రానా అంతా పాల్గొన్నారు. సినిమాకు సంబంధించి ఎక్స్ క్లూజివ్ గా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. బాహుబలి-2 లోగో కూడా విడుదల చేశారు. ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పంచుకున్నారు. దీంతో హైపర్ సైడై పోయింది. సరిగ్గా హైపర్ గురించి మాట్లాడుకోవాల్సిన టైమ్ లో జనాలంతా బాహుబలి-2 గురించి డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టారు.

నెట్ ఆన్ చేస్తే బాహుబలి-2 కబుర్లే. వాట్సాప్ ఛాట్ లో బాహుబలి-2 విశేషాలే. ఏ వెబ్ సైట్ చూసినా.. బాహుబలి-2 బ్రేకింగ్సే, చివరికి ఈరోజు న్యూస్ పేపర్ తిరగేసినా అదే హెడ్ లైన్స్. దీంతో హైపర్ కు హైప్ తగ్గిపోయింది. రామ్ సినిమాపై వేడి చల్లారిపోయింది. అర్జెంట్ గా బాహుబలి-2 నుంచి జనాల్ని తమవైపు తిప్పుకోకపోతే.. రామ్ కే అది చాలా నష్టం.

Loading...

Leave a Reply

*