మహేష్ సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్

untitled-27

స్టార్ డమ్ ఉంటే ప్రయోజనం అదే. బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ మరో హీరోకు ఎవరికైనా పడుంటే కనీసం ఏడాదైనా గ్యాప్ తీసుకునేవాడు. కానీ అక్కడున్నది సూపర్ స్టార్ మహేష్ బాబు. అతడి ఛరిష్మా-కరిష్మా ముందు డిజాస్టర్ కూడా వెలవెలబోయింది. మహేష్ మార్కెట్ పై బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ ఏమాత్రం పడలేదు. తాజాగా చేస్తున్న మురుగదాస్ సినిమాకు వస్తున్న ఆఫర్లు చూస్తుంటే… బ్రహ్మోత్సవం ప్రభావం అస్సలు పడలేదని అర్థం అవుతోంది.

బ్రహ్మోత్సవం లాంటి ఫ్లాప్ సినిమానే శాటిలైట్ రైట్స్ కింద 16 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా కొత్త సినిమాకు 30కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది. కేవలం శాటిలైట్ రైట్స్ కే 30కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఈ శాటిలైట్ రైట్స్ మొత్తంలో పెళ్లిచూపులు లాంటి క్వాలిటీ మూవీస్ 3 తీయొచ్చు. అలాంటి ఆఫర్ కు అడుగు దూరంలో ఉంది మహేష్ కొత్త సినిమా.

తాజా సమాచారం ప్రకారం… సన్ నెట్ వర్క్ గ్రూప్ మహేష్ టీంతో చర్చలు జరుపుతోంది. 30కోట్లుఇస్తా.. శాటిలైట్ రైట్స్ ఇచ్చేయమని బేరం పెట్టింది. అయితే మహేష్ టీం మాత్రం ఇంకా ఆలోచనలో ఉందట. నిజానికి 30కోట్లు అంటే కళ్లుమూసుకొని ఇచ్చేయొచ్చు. కాకపోతే… ఆ 30కోట్లలోనే తెలుగు-తమిళ-హిందీ శాటిలైట్ రైట్స్ అన్నీ ఉన్నాయి. అందుకే మహేష్ అండ్ కో ఆలోచనలో పడింది.

Loading...

Leave a Reply

*