10 నిముషాలు.. 10 ల‌క్ష‌ల వ్యూస్‌.. జ‌న‌తా రికార్డ్‌..!

pakka-lockal

జ‌నతా గ్యారేజ్ మ‌రో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా సంచ‌ల‌న విజ‌యం అందుకున్న ఈ మూవీ.. టాలీవుడ్ ఆల్‌టైమ్ టాప్ 3 హిట్స్‌లో నిలిచి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ సినిమాలో ప‌క్కా లోక‌ల్ సాంగ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ పాట ఓవ‌ర్‌నైట్ హిట్ అయింది. బంతిపూల జాన‌కి కాజ‌ల్ చేరిక‌తో ఈ పాట‌కి మ‌రింత గ్లామ‌ర్ యాడ్ అయింది. కాజ‌ల్ చేసిన తొలి ఐటెం సాంగ్ ఇది. దేవి శ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేసిన పాటకు తార‌క్‌-కాజ‌ల్ స్టెప్పులు అదిరిపోయాయి. సెకండాఫ్‌లో సినిమా కీల‌క ఘ‌ట్టానికి చేరుకున్న త‌ర్వాత వ‌చ్చిన ఈ పాటకి ఓ రేంజ్‌లో విజిల్స్ ప‌డ్డాయి. రీసెంట్‌గా కెవ్వు కేక పాట త‌ర్వాత మాస్‌లో మ‌రోసారి మార్మోగిన ఐటెం సాంగ్ ఇది.

త‌మ‌న్న‌, శృతిహాస‌న్ వంటి క‌థానాయికలు ఐటెం సాంగ్ చేసినా ప‌క్కా లోక‌ల్ సాంగ్‌కి వ‌చ్చినంత మాస్ లుక్ రాలేదు. కాజ‌ల్ హాట్ హాట్ అందాలు తార‌క్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా తోడ‌వ‌డంతో సినిమా రేంజ్ అమాంత పెరిగింది. ఇన్నాళ్లూ ఈ పాట టీజ‌ర్‌ని మాత్ర‌మే రిలీజ్ చేసిన ద‌ర్శ‌కనిర్మాత‌లు.. తాజాగా ప‌క్కా లోక‌ల్ ఫుల్ సాంగ్‌ని విడుద‌ల చేశారు. విడుద‌లయిందో లేదో అటు తార‌క్ అభిమానులు, ఇటు కాజ‌ల్ ఫ్యాన్స్‌తో పాటు మాస్ ఆడియెన్స్ కూడా ఈ పాట కోసం క్యూ క‌ట్టారు. అందుకే షార్ట్ టైమ్‌లోనే మంచి రికార్డ్ ద‌క్కించుకుంద‌ట ఈ సాంగ్‌. మీరు కూడా ఓ లుక్కేయండి…!

Loading...

Leave a Reply

*