ఆ హీరోయిన్ కు 15 నిమిషాలకే 2 కోట్లు…

untitled-5-copy

సినిమాకు 2 కోట్లు సంపాదించేవాళ్లను చూశాం. ఓ భారీ ఎగ్రిమెంట్ కుదుర్చుకొని కోట్లకు కోట్లు వెనకేసుకున్నవాళ్లను చూశాం. కానీ కేవలం 15 నిమిషాల ఎప్పీయరెన్స్ కే 2 కోట్ల రూపాయలు సంపాదించిన హీరోయిన్ మాత్రం ఒకరున్నారు. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ సెన్సేషన్ రకుల్ ప్రీత్ సింగ్. అవును… కేవలం 15 నిమిషాలు డాన్స్ చేసేందుకు రకుల్ ప్రీత్ సింగ్ 2 కోట్లు తీసుకుంటోంది. ఇప్పటివరకు తన సినిమాలకు కూడా ఆమె ఇంత ఎమౌంట్ తీసుకోలేదు.

అయినా ఇచ్చేవాళ్లుంటే తీసుకోవడానికేం ఖర్మ. రకుల్ ప్రస్తుతం అదే చేస్తోంది. మైనింగ్ కింగ్ గాలి జనార్థనరెడ్డి త్వరలోనే తన కూతురు వివాహాన్ని చేయబోతున్నాడు. ఆ పెళ్లిలో రకుల్ ప్రీత్ సింగ్ తో గానా బజనా ఏర్పాటుచేశాడు. దాని కోసం ఆమెకు 2 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించలేదు గాలి. వేల కోట్ల రూపాయలున్న గాలి నుంచి 2 కోట్లు తీసుకోవడానికి రకుల్ కూడా ఏమాత్రం మొహమాటపడలేదు. ఓ పబ్లిక్ ఫంక్షన్ లో రకుల్ ఇలా చిందేయబోవడం ఇదే తొలిసారి.

నిజానికి ఈ సంగీత్ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్స్ ను ప్లాన్ చేశాడట గాలి. కానీ షారూక్, కత్రిన, దీపిక లాంటి తారలు బిజీగా ఉండడంతో.. ఆఖరి నిమిషంలో టాలీవుడ్ స్టార్స్ తో సరిపెట్టుకుంటున్నాడట. రకుల్ తో పాటు ప్రియమణి కూడా ఈ ఆటపాటలో పాల్గొని… ఆహుతుల్లో హుషారు తెప్పించబోతోందట.

Loading...

Leave a Reply

*