వంద కోట్లు వచ్చాయంటున్నారు.. కానీ అసలు లెక్క మాత్రం…

ntr

టాలీవుడ్ ఆల్ టైం హిట్స్ లో నంబర్-3 పొజిషన్ లో ఉందంటున్నారు. సినిమాకు ఇప్పటికే వంద కోట్ల రూపాయలు వచ్చాయంటున్నారు. రేపోమాపో శ్రీమంతుడ్ని కూడా క్రాస్ చేసేస్తుందని అంటున్నారు. కానీ జనతా గ్యారేజ్ కు సంబంధించిన అసలైన లెక్కలు ఇప్పుడు బయటపడ్డాయి. నిజానికి సినిమాకు వందకోట్ల రూపాయలు వచ్చాయని చెబుతోంది గ్రాస్ లెక్కల్లో. కానీ కావాల్సింది గ్రాస్ లెక్కలు కాదు.. షేర్ లో ఎంత వచ్చిందనేదే ఇంపార్టెంట్. ఆ కీలకమైన లెక్కల్ని ఎట్టకేలకు విడుదల చేసింది జనతా గ్యారేజ్ టీం.

సినిమా 25 రోజుల వసూళ్లను ప్రజెంట్ చేసింది. నిర్మాతల లెక్క ప్రకారం… అన్నీ కలుపుకొని జనతా గ్యారేజ్ కు దాదాపు 81 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇందులో కేరళ వసూళ్లతో పాటు ఓవర్ ఫ్లో లెక్కలు కూడా కలిపి ఉన్నాయి. ఈ 81 కోట్ల రూపాయలు కాకుండా… అదనంగా చూపించడానికి ఒక్క పైసా కూడా లేదన్నమాట. ఇదీ జనతా గ్యారేజ్ అసలైన లెక్క. ఇప్పుడు ఏరియా వైజ్ సినిమాకు ఎంత వచ్చిందో చూద్దాం.

నైజం : 18.62 కోట్లు
సీడెట్ : 11.45 కోట్లు
ఉత్తరాంధ్ర : 7.26 కోట్లు
ఈస్ట్ : 4.62 కోట్లు
వెస్ట్ : 4.03 కోట్లు
కృష్ణా : 4.28 కోట్లు
గుంటూరు : 5.75 కోట్లు
నెల్లూరు : 2.24 కోట్లు
AP+Nizam: 58.25 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు.. (మలయాళం వెర్షన్ తో కలిపి) : 81 కోట్లు

Loading...

Leave a Reply

*