అట్టర్ ఫ్లాప్ అన్నారు.. వంద కోట్లు వచ్చాయి.

ntr

ఈమధ్య చాలా సినిమాల విషయంలో ఇదే జరుగుతోంది. సరైనోడు సినిమా బాగాలేదన్నారు. కానీ ఆ సినిమా బన్నీ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక తాజాగా వచ్చిన జనతా గ్యారేజ్ కు కూడా విడుదల సమయంలో మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ తెలుగు చిత్రసీమలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో మూడో సినిమాగా జనతా గ్యారేజ్ నిలిచింది. ఇప్పుడు విక్రమ్ నటించిన ఇంకొక్కడు సినిమా కూడా ఈ లిస్ట్ లోకి చేరింది. సినిమా విడుదలైన మొదటి రోజు, మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. విక్రమ్ గెటప్ మినహా, సినిమాలో పస లేదన్నారు. కానీ మూవీకి మాత్రం వంద కోట్లు వచ్చాయి.చియాన్ విక్రమ్ నటించిన ఇరుముగన్ తమిళనాట సూపర్ హిట్ అయ్యింది .

తెలుగులో ఇంకొక్కడు గా రిలీజ్ అయినప్పటికీ అంతగా హిట్ కాలేదు. కానీ వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. విక్రమ్ సరసన నయనతార ,నిత్యా మీనన్ లు నటించగా ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు . విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 95 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ల ని సాధించింది. మరో 3 రోజుల్లో కచ్చితంగా వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతుంది.వసూళ్లు వస్తున్నప్పటికీ తన సినిమాకు ఫ్లాప్ టాక్ రావడాన్ని మాత్రం విక్రమ్ తట్టుకోలేకపోతున్నాడు. ఓ యూనివర్సల్ హిట్ కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈసారి ఏ దర్శకుడితో, ఎలాంటి కథను విక్రమ్ రెడీ చేసుకుంటాడనేది చూడాలి.

Loading...

Leave a Reply

*