వార్నీ.. ఈ పిల్లకు కూడా కట్టేస్తున్నారా…

kerti

దేశంలో ఎక్కువ మంది సినీప్రేమికులు ఉన్న ప్రాంతం ఏది. దీనికి సమాధానం చెప్పడం కష్టం. ఎఁదుకంటే.. దాదాపు ప్రతి రాష్ట్రంలో సినీ అభిమానులు ఉంటారు. అయితే దేశంలో ఎక్కువమంది సినిిమా పిచ్చోళ్లు ఉన్న రాష్ట్రం చెప్పమంటే మాత్రం కచ్చితంగా తమిళనాడు పేరునే చెబుతారు. అక్కడ హీరోహీరోయిన్లకు గుళ్లు కట్టించేంత పిచ్చి ఉంది. ఇప్పటికే ఖుష్బూ, నయనతార లాంటి తారలకు గుళ్లు కట్టేసి… పూజలు-అభిషేకాలు చేసేస్తున్నారు. ఇప్పుడు మరో ముద్దుగుమ్మకు కూడా దండేసి దండం పెట్టేయడానికి రెడీ అవుతున్నారు.

ఆ ముద్దుగుమ్మ పేరు కీర్తి సురేష్. తెలుగులో ఆమె నేను శైలజ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ లో అంతకంటే కాస్త ఎక్కువ క్రేజే ఉంది. ఈ మాత్రం క్రేజ్ చాలు గుడి కట్టేస్తాం అంటున్నారు తమిళ సినీజనం. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటుంది. ఇప్పటికే ధనుష్ సరసన ‘థొడరి’ అనే చిత్రంలో మెరిసిన కీర్తి సురేష్ తక్కువ టైమ్ లోనే 3-4 సినిమాల వరకు చేసేసింది. ప్రస్తుతమైతే విజయ్ సరసన ‘భైరవి’ సినిమాలో నటిస్తుండగా.. మరో స్టార్ హీరో సూర్యతో జతకట్టడానికి రెడీ అవుతుంది.

ఇలా అగ్ర హీరోలతో జతకడుతూ దూసుకుపోతున్న కీర్తి సురేష్ బొద్దుగా కూడా ఉండటంతో తమిళ తంబీలకు తెగ నచ్చేసిందని సమాచారం. గతంలో ఖుష్బూ, నమిత లాంటి బొద్దుగుమ్మలకు గుడులు కట్టిన హిస్టరీ తమిళనాడుకు ఉంది. అందుకే బొద్దుగా ఉన్న కీర్తి సురేష్ కు కూడా గుడి కట్టేయాలని ఫిక్స్ అయిపోయారు. పని పూర్తయిన తర్వాత రిబ్బన్ కటింగ్ కు ఆమెనే పిలుస్తారేమో చూడాలి.

Loading...

Leave a Reply

*