బాహుబలి నుంచి కరణ్ జోహార్ తప్పుకుంటాడా…

karan

బాహుబలి ప్రాజెక్టుకు కరణ్ జోహార్ కు విడదీయరాని బంధం ఉంది. బాహుబలి పార్ట్-1కు బాలీవుడ్ లో అంత క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం కరణ్ జోహార్ మాత్రమే. తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాహుబలి సినిమాను నార్త్ లో భారీగా విడుదల చేశాడు కరణ్. అంతేకాదు.. ముంబయి, ఢిల్లీ, పుణె లాంటి పట్టణాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ఎటెన్షన్ బాగా క్రియేట్ చేయగలిగాడు. దీనికి తోడు సినిమాలో దమ్ము కూడా ఉండడంతో… బాహుబ సినిమా ఇరగ ఆడేసింది.

బాహుబలి పార్ట్-1కు అంత సహాయం చేసిన కరణ్ జోహార్ ను పార్ట్-2 కోసం కూడా కొనసాగించారు నిర్మాతలు. పిలిచి మరీ పార్ట్-2 హక్కులు ఇస్తామని ఆఫర్ చేశారట. కరణ్ కూడా అందుకే సై అన్నాడు. కానీ అంతలోనే మాట మార్చేశాడు. ఇప్పుడు బాహుబలి ప్రాజెక్టు నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నాడట కరణ్. దీనికి కారణం తాజాదా యే దిల్ హే ముష్కిల్.

ఐశ్వర్యరాయ్, రణబీర్ జంటగా నటించిన ఈ సినిమా హిట్ అయితే, ఆ డబ్బుతో పార్ట్-2 రైట్స్ కొనాలని అనుకున్నాడట కరణ్. కానీ ఫస్ట్ డే నుంచే ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అందుకే ఇప్పుడు రైట్స్ కొనాలా వద్దా ఆలోచనలో ఉన్నాడట కరణ్. మరోవైపు పార్ట్-2 నార్త్ రైట్స్ కోసం చాలా ఎక్కువ మొత్తం చెబుతున్నారట నిర్మాతలు.

Loading...

Leave a Reply

*