వివాదాలే వంద కోట్లు తెచ్చిపెట్టాయి…

aish

విడుదలకు ముందు ఏ దిల్ హే ముష్కిల్ ఎంత వివాదం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అందలో ఐశ్వర్యరాయ్ ఏదో చేసేసిందని, ఇంకేదో చూపించేసిందని ప్రచారం జరిగింది. చివరికి ఈ వివాదంలోకి సెన్సార్ బోర్డ్ ను కూడా లాగారు. అలా అత్యంత వివాదాస్పద చిత్రంగా పేరుతెచ్చుకున్న ఏ దిల్ హే ముష్కిల్ కు అదే కలిసొచ్చింది. ఇందులో ఏముందో చూద్దామని జనాలు ఎగబడ్డారు. అలా 4 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది యే దిల్ హే ముష్కిల్ సినిమా.

సినిమా స్టోరీలైన్ చాలా సింపుల్. కానీ స్టార్ ఎట్రాక్షన్ మాత్రం అదుర్స్. అందుకే యే దిల్ హే ముష్కిల్ సినిమా అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ప్రస్తుతానికైతే ఈ మూవీ హవా తగ్గింది. వివాదాలతోనే వంద కోట్లు సంపాదించినప్పటికీ.. సినిమా స్టఫ్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ఈ వీకెండ్ నాటికి ఈ మూవీ బిచానా ఎత్తేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

ఇప్పుడు వంద కోట్లు వచ్చాయని చంకలు గుద్దుకుంటున్న యూనిట్ కు లాంగ్ రన్ తర్వాత నష్టాలే కనిపిస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే.. రణబీర్, ఐష్ మార్కెట్ వాల్యూని మించి ఈ సినిమాకు పెట్టుబడి పెట్టారు. అంత రాబట్టాలంటే.. వందకోట్లను మించి వసూళ్లు సాధించాలి. అది మాత్రం కష్టం అంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఏదేమైనా వచ్చే సోమవారం నాటికి ఐష్ కొత్త సినిమా అవుట్ పుట్ తేలిపోతుంది.

Loading...

Leave a Reply

*