ఆ హీరో ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు

radhika

సంచలనాలకు పెట్టింది పేరు రాధికా ఆప్టే. తెరపై బోల్డ్ గా నటించాలన్నా… తెరవెనక సంచలన ప్రకటనలు చేయాలన్నా ఇప్పుడు అంతా రాథికా ఆప్టే వైపు చూస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు ఓ సౌత్ హీరోపై భారీ విమర్శలు చేసింది. ఓ హీరో తనను రాత్రి పూట తన గదికి రమ్మన్నాడని బాంబు పేల్చింది. దాంతో షాక్ అయ్యానని అయితే అతడికి గట్టిగానే బుద్ది చెప్పానని రాథికా ఆప్టే ప్రకటించింది. కానీ ఆ హీరో, ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడాడని, కోరిక తీర్చాలని బలవంతం చేయబోయాడని చెప్పుకొచ్చింది. అయితే ఓ పెద్ద హీరో తనను రాత్రికి రమ్మన్నాడని చెప్పింది కానీ ఇంతకీ ఆ హీరో ఎవరు ?

ఆ మాట అన్నది ఎప్పుడు ? అని మాత్రం క్లియర్ గా చెప్పలేదు. కానీ ఓ బడా హీరో వర్గం మాత్రం రాథికా ఆప్టేకు వార్నింగ్ లు ఇవ్వడం స్టార్ట్ చేసింది.తమ హీరో పేరు బయటపెడితే మర్యాదగా ఉండదంటూ రాథికా ఆప్టేకు వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ఆ హీరో పేరు కనుక బయటపెడితే… సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టకుండా చేస్తామని… అసలు కనిపించకుండా కూడా చేస్తామని సదరు హీరోగారి అభిమాన వర్గం రాధికా ఆప్టేకు వరుసగా వార్నింగ్ లు పంపిస్తూనే ఉందట.

మరీ ముఖ్యంగా కెరీర్ అన్నదే లేకుండా చేస్తామనేది… ఆ అభిమాన వర్గం చేస్తున్న ప్రధాన హెచ్చరిక. అయితే వీటిని రాథిక మాత్రం లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం.ప్రస్తుతం రాథికా ఆప్టే ముంబయిలో ఉంది. ఓ మలయాళ సినిమాతో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్టులు ఒప్పుకుంది. తను బాంబ్ పేల్చిన వెంటనే ఇలాంటి బెదిరింపులు వస్తాయని రాథికాకు తెలుసు. వాటన్నింటికీ మెంటల్లీ ప్రిపేర్ అయిన తర్వాతే, రాధికా ఇలా బయటపడ్డానికి ఫిక్స్ అయింది. మరి ఈ బెదిరింపులు ఆమె ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*