పవన్, మహేష్ పై భానుప్రియ షాకింగ్ కామెంట్స్…

mahi

తెరపైనే కాదు.. నిజజీవితంలో కూడా అంతే సాఫ్ట్ గా ఉంటారు భానుప్రియ. క్లాసికల్ డాన్సర్ గా, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న భానుప్రియ… వివాదాలకు ఆమడ దూరంలో ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ, తనకు చేతనైంది మాత్రమే చేస్తూ… ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతారు. తాజాగా ఈ సీనియర్ నటి పవన్, మహేష్ లపై కామెంట్స్ చేశారు. కుదిరితే వాళ్ల సరసన హీరోయిన్ గా నటించాలని ఉందంటూ షాకింగ్ స్టేట్ మెంట్స్ ఇచ్చారు.

తెలుగులో ఆమె నాతిచరామి అనే సీరియల్ లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భానుప్రియ.. తనకు మహేష్, పవన్ అంటే చాలా ఇష్టమని.. వాళ్లు ఒప్పుకుంటే వాళ్ల సరసన హీరోయిన్ గా నటిస్తానని మీడియాతో జోక్ చేశారు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో మహేష్ చాలా అందగాడని, అతడి సినిమాలో నటించాలని ఉందని భానుప్రియ అన్నారు. ఇక పవన్ విషయానికొస్తే… పవర్ స్టార్ యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని, అత్తారింటికి దారేది సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కలేదని చెప్పుకొచ్చారు.

అయితే ఇంటర్వ్యూ ప్రారంభంలోనే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తానని భానుప్రియ చెప్పి అందర్నీ షాక్ కు గురిచేశారు. తర్వాత సరదాగా దాన్ని కవర్ చేశారు. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ కు తల్లిగా కనిపించిన భానుప్రియ.. మహేష్ సినిమాలో అతడికి అమ్మగా కనిపించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అటు పవన్ సినిమాల్లో కూడా క్యారెక్టర్ రోల్స్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

Loading...

Leave a Reply

*