నా మొగుడితో అలాంటి ప‌నులా.. నంద‌మూరి హీరోయిన్‌కి హీరో భార్య వార్నింగ్‌..!

nanda

ఈమెను గుర్తుప‌ట్టారా…? అవును, ఈ క‌త్తి లాంటి భామ‌.. క‌త్తి సినిమాలో హీరోయిన్‌. క‌ల్యాణ్ రామ్ స‌ర‌స‌న న‌టించిన క‌త్తితో ఆమె టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ త‌ర‌వాత చెప్పుకోద‌గ్గ చాన్స్‌లు రాలేదు. ఇంకేముంది బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్క‌డ కూడా సేమ్ సీన్‌. స‌రైన గుర్తింపు రాలేదు. దీంతో, చిన్న చిన్న యాడ్‌లు, ఫోటో షూట్‌ల‌కే ప‌రిమిత‌మ‌యిన ఈ భామ‌.. లేటెస్ట్‌గా దుమ్ము దుల‌పాల‌ని డిసైడ్ అయింది. ఇంకేముంది హాట్ హాట్‌గా రెడీ అయింది.

స్కిన్ షో లేకుంటే చాన్స్‌లు రావ‌నుకుందో లేక‌, రాధికా ఆప్టే లాంటి భామ‌లే రెచ్చిపోతుంటే నాకేమ‌యింద‌ని భావించిందో కానీ, వారికంటే ఓ అడుగు ముందుకేసింది. వజాహ్ తుమ్ హో సినిమాలో ఆమె న‌టించిన కొన్ని సీన్‌లు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్‌లో హిట్ అయిన హేట్ స్టోరీ సిరీస్‌లో థ‌ర్డ్ పార్ట్‌. ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌లో స‌నా ఖాన్‌దే కీల‌క పాత్ర‌. పార్ట్ 2లో హీరోయిన్‌గా పోర్న్ స్టార్ స‌న్నీలియోన్ న‌టించింది. ఇది థ‌ర్డ్ సీక్వెల్‌. ఇందులో స‌నాఖాన్ స‌న్నీలియోన్‌ని మించిపోయేలా క‌నిపిస్తోంది.

స‌నాఖాన్‌.. ఈసినిమాలో హీరో గుర్‌మీత్ చౌద‌రితో క‌లిసి స‌నాఖాన్ ఎరోటిక్ సీన్స్‌లో రెచ్చిపోయింది. శృతిమించి న‌టించింద‌ని ట్ర‌యిల‌ర్‌లో సీన్‌లే చెబుతున్నాయి. దీంతో, ట్ర‌యిల‌ర్ చేసి గుర్‌మీత్ చౌద‌రి భార్య స‌నాఖాన్‌పై విరుచుకుపడుతోంద‌ట‌. నా భ‌ర్త‌తో ఈ రేంజ్‌లో శృంగార‌ప‌ర‌మైన సీన్‌ల‌లో న‌టిస్తావా? అంటూ స‌నాఖాన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతోంద‌ట‌. దీంతో, నంద‌మూరి హీరోయిన్ స‌నాఖాన్ ఏం చెయ్యాలో తోచ‌క దిక్కులు చూస్తోంద‌ట‌.

మ‌రోవైపు, స‌నాఖాన్ హీరో.. గుర్‌మీత్ చౌద‌రి ఆమె భార్య‌ను కాకా ప‌ట్ట‌డానికి ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసి ఆమెతో క‌లిసి ఫ్ల‌యిట్ ఎక్కాడ‌ట‌. దీంతో, ఆమె కోపం చ‌ల్లారింద‌ని బాలీవుడ్ జ‌నాలు గుస‌గుస‌లు పోతున్నారు. అయినా, పాపం స‌నాఖాన్ త‌ప్పేముంది..? ఆమె భ‌ర్త లేదా ద‌ర్శ‌కుడి గురించి ఆలోచించాలి కానీ.. ఇదేంట‌మ్మా అంటున్నారు.

Loading...

Leave a Reply

*