హాలీవుడ్ రేంజ్ లో రిలీజైంది

baubhali2

బాహుబలి-2 టైటిల్ రిలీజ్ అయింది. ఇన్నాళ్లూ ఈ సినిమా పేరు బాహుబలి-2.. ది కన్ క్లూజన్ అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఈ టైటిల్ డిజైన్ ఎలా ఉండబోతోందనే విషయంపై మాత్రం కొంత ఆసక్తి అలానే ఉంది. ఎట్టకేలకు రాజమౌళి అండ్ కో… బాహుబలి-2 టైటిల్ ను విడుదల చేసింది. ఈ టైటిల్ విడుదల కోసం భారీ తెరను కూడా ఏర్పాటుచేశారు. ఆ తెరపై బాహుబలి-2 టైటిల్ ను గ్రాండ్ గా విడుదల చేశారు.బాహుబలి-1 సినిమా విడుదలైనప్పుడు టైటిల్ తోనే హైప్ క్రియేట్ అయింది.

ఓ చిన్న పిల్లాడ్ని నదిలో చేతిపై పట్టుకొని వచ్చే స్టిల్ పై బాహుబలి టైటిల్ ముద్రించారు. అటు సినిమాలో కూడా బాహుబలి-ది బిగినింగ్ టైటిల్ అద్భుతంగా కనిపిస్తుంది. ఆ టైటిల్ యానిమేషన్ ఇప్పటికీ గుర్తే. ఇప్పుడు బాహుబలి-ది కన్ క్లూజన్ టైటిల్ కూడా అదే రేంజ్ లో తెరకెక్కింది. బాహుబలి టైటిల్ డిజైన్ ను మార్చకపోయినా.. వెనక 2 అనే సంఖ్యను ముద్రించారు. లోగో డిజైనింగ్ కోసం చాలా కష్టపడిన విషయాన్ని టైటిల్ చూసినవాళ్లు ఎవరైనా గుర్తిస్తారు. అలా టైటిల్ తోనే బాహుబలి-2 సినిమాకు కూడా ప్రచారం మొదలైంది.

Loading...

Leave a Reply

*