అసలు విషయం బయటపెట్టిన చైతూ దర్శకుడు…

untitled-9

సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో మరోసారి తెరపైకి వచ్చాడు నాగచైతన్య. ప్రేమమ్ తో సక్సెస్ అందుకున్న ఈ హీరో… తాజా మూవీతో కూడా ఓ మోస్తరుగానే మార్కులు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉండగా… ఈ సినిమాకు సంబంధించి సెకెండాఫ్ లో ఓ అంశం మాత్రం ప్రేక్షకులకు నచ్చలేదు. అదేంటంటే… నాగచైతన్య చెప్పుకుంటూ పోతుంటాడు… సినిమా నడుస్తుంటుంది… నిజానికి ఇది గౌతమ్ మీనన్ స్టయిల్ ఆఫ్ మేకింగే. కానీ నాగచైతన్య అలా చెప్పుకుంటూ పోవడంతో జనాలు బోర్ ఫీలయ్యారు.

ఆ ఎపిసోడ్ ను మరోలా ప్రజెంట్ చేస్తే బాగుండేదని ఫీల్ అయ్యారు. అది నిజమేనని ఒప్పుకున్నాడు దర్శకుడు గౌతమ్ మీనన్.సెకెండాఫ్ లో స్క్రీన్ ప్లే తేడా కొట్టిన అంశాన్ని గౌతమ్ మీనన్ కూడా అంగీకరించాడు. నిజానికి స్టోరీ బోర్డ్ లో సెకండాఫ్ అలా లేదంటున్నాడు గౌతమ్ మీనన్. స్క్రీన్ ప్లే మొత్తం వేరేలా ఉందని, కానీ సమయం-డబ్బు కోపరేట్ చేయకపోవడం వల్ల.. సెకెండాఫ్ ను అలా ముగించేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. క్లయిమాక్స్ లో వచ్చే సబ్ ప్లాట్ ను డైలాగ్స్ ద్వారా కాకుండా…

మాంటేజ్ షాట్స్ ద్వారా చూపించాలనుకున్నాడట గౌతమ్ మీనన్. స్క్రిప్ట్ లో కూడా అలానే రాసుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదని ప్రకటించాడు.గతంలో ఓసారి రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు… సమయం లేకపోవడం వల్ల స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ ను పక్కనపెట్టి.. క్లయిమాక్స్ ను చుట్టేశాడట గౌతమ్ మీనన్. ఆ తర్వాత సినిమా వాయిదా పడినప్పటికీ… తను అనుకున్నట్టు దాన్ని రీషూట్ చేయలేకపోయాడట. అందుకే ఇప్పటికీ సినిమాలో ఆ క్లయిమాక్స్ అలా కనిపిస్తుంది.

Loading...

Leave a Reply

*