పవన్, మహేష్ ను అవమానిస్తున్నాడు…

geethakrishna

అవకాశాలు రాకపోతే.. స్టార్ హీరోల్ని టార్గెట్ చేయడం, వాళ్లను కామెంట్స్ చేయడం ఈమధ్య కామన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల్ని కామెంట్ చేస్తే మీడియా ఎటెన్షన్ తమపైకి వస్తుందని, ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని చాలమంది భావిస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన ఓ పనిలేని క్రిటిక్ (పేరు తెలిసినా చెప్పడం లేదు) ఇలానే ఆ మధ్య పవన్ పై లేనిపోనివన్నీ మాట్లాడి ఫ్రీ పబ్లిసిటీ కొట్టేశాడు. పవన్ ను కామెంట్ చేస్తే అంతా తనవైపు చూస్తారనే ఛీప్ పబ్లిసిటీ స్టంట్ ను బాగానే క్యాష్ చేసుకున్నాడు. ఇప్పుడు మరో దర్శకుడు అదే బాటలోనడుస్తున్నాడు.తెలుగులో పలు సినిమాలు తెరకెక్కించిన గీతాకృష్ణ… ఇప్పుడు స్టార్ హీరోలపై మండిపడుతున్నాడు.

మరీ ముఖ్యంగా పవన్, మహేష్ లను టార్గెట్ చేస్తూ… ఘోరంగా కామెంట్స్ చేస్తున్నాడు గీతాకృష్ణ. మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సీరియల్ కంటే దారుణమైన సినిమా అని , అలాగే పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ ల సినిమాల కంటే బిచ్చగాడు సినిమా బెటర్ అని విమర్శిస్తున్నాడు. వాళ్ళు బిచ్చగాళ్ళ కంటే అధ్వన్నామని ఘోరంగా అవమానిస్తున్నాడు ఒకప్పటి దర్శకులు గీతా కృష్ణ . నాగార్జున తో కెరీర్ తొలినాళ్ళ లో సంకీర్తన  శోభన తో కోకిల అనే చిత్రాలను తీసిన దర్శకుడు ఈ గీతా కృష్ణ . అయితే ఈ దర్శకుడు పలు చిత్రాలను నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు కానీ హిట్స్ అందుకున్న దాఖలాలు లేవు.

అయినప్పటికీ తానొక క్రియేటివ్ డైరెక్టర్ నని ఫీల్ అవుతుంటాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో టాలీవుడ్ టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ లపై ఘోరంగా కామెంట్స్ చేసి సంచలనం సృష్టించాడు.ప్రస్తుతం తెలుగులో గీతాకృష్ణ ఓ సీ-గ్రేడ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పైగా అది రేపోమాపో విడుదల అవుతోంది. ఆ సినిమాకు ప్రచారం రావాలంటే ఇలా స్టార్ హీరోల్ని తిట్టాలనుకుంటున్నాడు. అందుకే ప్రస్తుతం మహేష్, పవన్ ను టార్గెట్ చేస్తున్నాడు.

Loading...

Leave a Reply

*