హ్యాట్రిక్ వీరుడికి బ్రేకులు తప్పవా…?

majnu

వరుసగా 3 విజయాలు… ఊహించని స్టార్ డమ్… ఒక్కసారిగా పెరిగిన మార్కెట్.. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో తిరుగులేని ఫాలోయింగ్.. ఇలా నాని కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇదే ఊపులో మజ్ను సినిమాను విడుదల చేస్తున్నాడు నాని. విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అయితే సినిమాపై ప్రారంభమైన నెగెటివ్ టాక్ మాత్రం నాని విజయాల జోరుకు అడ్డుకట్ట వేసేలా ఉంది. అవును… మజ్ను సినిమా నెగెటివ్ టాక్ తో ప్రారంభమైంది.నిజానికి ప్రీ-రిలీజ్ బజ్ నుంచే నెగెటివ్ టాక్ బయటకు వచ్చింది. ఊహించిన స్థాయిలో సినిమా లేదనే ప్రచారం మొదలైంది.

మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే టాక్ కంటిన్యూ అవ్వడంతో నానికి ఈసారి కష్టాలు తప్పవనే అనిపిస్తోంది. ఈ సినిమాతో మరో హిట్ కొట్టి, తన సక్సెస్ రేటును మరింత పెంచుకోవాలని నాని భావించాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. సామాన్య జనాలకు కనెక్ట్ అయ్యే రేంజ్ లో సినిమా కథ లేదనే టాక్ వినిపిస్తోంది.అయితే ఈమద్య కాలంలో నెగెటివ్ సెంటిమెంట్ వచ్చిన తర్వాత కాసులు కురవడం కామన్ అయిపోయింది. జనతా గ్యారేజ్, సరైనోడు సినిమాల విషయంలో ఇదే జరిగింది. సో… మజ్ను కూడా అలానే ఒడ్డెక్కితే బాగుంటుందని యూనిట్ భావిస్తోంది. మరి నాని అదృష్టం ఎలా ఉందో చూడాలి.

Loading...

Leave a Reply

*