హెలికాప్ట‌ర్ ఘ‌ట‌న‌కు కార‌ణం అత‌నే.. ప‌రారీలో స‌ద‌రు వ్య‌క్తి…!

untitled-111

శాండ‌ల్‌వుడ్ మొత్తాన్ని షేక్ చేసిన ఘ‌ట‌న ఇది. ఇద్ద‌రు యువ విల‌న్‌లు, క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ‌ర‌స విజ‌యాలతో దూసుకుపోతున్న వర్ద‌మాన ఖ‌ల్‌నాయ‌క్‌లను పొట్ట‌న పెట్టుకుంది నిన్న‌టి హెలికాప్ట‌ర్ ఎపిసోడ్‌. ఇలాంటి ఫైట్‌లు చాలా కామ‌న్‌. ఈ హెలికాప్ట‌ర్ ఫైట్ సీన్‌లో రిస్క్ మేట‌ర్ లేదు. ఎన్నో సినిమాల‌లో ఇలాంటి ఫైట్‌లు తెర‌కెక్కాయి. అలా అని కొత్త‌గానూ లేదు. రొటీన్ ఫైట్‌. కానీ, ఒక్క వ్య‌క్తి త‌ప్పిదం వ‌ల్లే ఈ ఎపిసోడ్ జ‌రిగింద‌ట‌. అత‌ని నిర్ల‌క్ష్యం, అత‌ని అజాగ్ర‌త్త‌, అత‌ని అతి విశ్వాస‌మే ఈ మొత్తం ఘ‌ట‌నను విషాదంగా మార్చింద‌ని సినిమా షూటింగ్ యూనిట్ చెబుతోంది.

శాండ‌ల్‌వుడ్‌ని కుదిపేసిన ఈ ఘ‌ట‌న వెనుక ఉన్న‌ది ఆ మూవీ స్టంట్ మాస్ట‌ర్ ర‌వి వ‌ర్మ అట‌. ఆయ‌న ఘోర త‌ప్పిదం వ‌ల్లే ఇది జ‌రిగింద‌ట‌. హెలికాప్ట‌ర్ ఎపిసోడ్ షూటింగ్ చేస్తున్న టైమ్‌లో ముందుగా విల‌న్‌లు ఉద‌య్‌, అనిల్‌కి ఈత రాద‌ని చెప్పార‌ట‌. క‌నీసం మేనేజ్ చేసేంత‌గా కూడా స్విమ్మింగ్ రాద‌ని అటు డైరెక్ట‌ర్‌, ఇటు ఫైట్ మాస్ట‌ర్‌తోపాటు షూటింగ్ యూనిట్ మొత్తానికి వివ‌రించార‌ట. కానీ, ర‌వి వ‌ర్మ ఏమీ కాదు.. ప‌క్క‌నే ఉంటాం క‌దా.. అనే అతి విశ్వాస‌మే వారి కొంప ముంచింద‌ట‌.

ఇటు, మర‌బోట్‌లను కూడా చెక్ చెయ్య‌లేద‌ట పూర్తిగా. అవి బాగా ప‌నిచేస్తున్నాయా..? లేదా..? అనేది చూడాలి. అందులోనూ కేర్ తీసుకోలేద‌ట‌. క‌నీసం హెలికాప్ట‌ర్ నుంచి దూక‌డానికి సిద్ధంగా టైమ్‌లో ప‌క్క‌నే స్విమ్మింగ్ పిల్లోలు, లైఫ్ జాకెట్‌లు లాంటివి అయినా అరేంజ్ చెయ్యాలి. ముగ్గురిలో ఒక్క‌రికి ఈత‌వచ్చినా మిగిలిన వారిని కాపాడే చాన్స్ ఉండేది. అవి వారికి అందుబాటులో లేకుండా చేశారు. ఇదో మ‌రో త‌ప్పిదం. ఇవ‌న్నీ లేక‌పోయినా.. ఈత‌రాద‌ని తెలిసిన‌ప్పుడు వారు క‌నీసం గ‌జ ఈత‌గాళ్ల‌ను అయినా అరేంజ్ చేసుకొని ఉండాలి. అది కూడా చూసుకోలేదు.

ఇలాంటి రిస్క్‌ల‌న్నీ ముందు స్టంట్ మాస్ట‌రే అరేంజ్ చేసుకోవాలి. కానీ, ఆయన ఈ రిస్క్‌లు ఏవీ ఆలోచించ‌లేద‌ట‌. అందుకే, ఇంత ఘోర ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుస్తోంది. ర‌వి వ‌ర్మ క‌నుక వీటిలో ఏ ఒక్క విష‌యంలో అయినా జాగ్ర‌త్త తీసుకొని ఉంటే.. ఇలా జ‌రిగేది కాద‌ని నిపుణ‌లు చెబుతున్నారు. ఇవే ఉద‌య్‌, అనిల్ పాలిట శాపంగా మారాయి. అందుకే, మొద‌ట డైరెక్ట‌ర్‌దే త‌ప్పు అన్న వారంతా.. ఇప్పుడు ఫైట్ మాస్ట‌ర్‌ని వేలెత్తి చూపుతున్నారు. ఆయ‌న కూడా కావాల‌ని చేసింది కాదు. కేవ‌లం చిన్న అజాగ్ర‌త్త‌, నిర్ల‌క్ష్య‌మే ఇలా చేసింది. దీంతో, భ‌య‌ప‌డిన ర‌వివర్మ పారిపోయాడ‌ట‌. ప్ర‌స్తుతం ఆయ‌న ఎవ‌రికీ అందుబాటులో లేడ‌ని స‌మాచారం.

 

Loading...

Leave a Reply

*