చిరంజీవి కూతురి త‌ప్పును త‌న మీదేసుకున్న లారెన్స్‌..!

222

ఖైదీ నెంబ‌ర్ 150.. ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు మొద‌ట స‌రైనోడు హీరోయిన్ కేథ‌రిన్ ట్రెసాని కన్‌ఫ‌మ్ చేశారు. ఆమె కూడా చిరంజీవి రీ ఎంట్రీ మూవీ అన‌గానే ఎగిరి గంతేసి మ‌రీ ఓకే చేసింది. కానీ, ఆమె ఆనందం కాసేప‌ట్లోనే ఆవిర‌యింది. ఆమెను లారెన్స్ తొల‌గించాడ‌ని, ఆమె ప్లేస్‌లో మ‌రో సౌత్ బ్యూటీ.. ల‌క్ష్మీరాయ్‌కి చాన్స్ ఇచ్చాడ‌ని టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రిగింది. లారెన్స్‌కు వివాదాలు కొత్త కాదు. గతంలో ఆయ‌న హీరోయిన్‌ల‌ను, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ల‌ను తొల‌గించాడు. దీంతో, ఈ కాంట్ర‌వ‌ర్సీకి ఆయ‌నే కార‌ణ‌మ‌ని భావించారంతా.

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత అస‌లు వివాదానాకి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఈ సినిమాకి స్ట‌యిలిస్ట్‌గా పనిచేస్తున్నారు. చిరంజీవితోపాటు సినిమాలోని మొత్తం యూనిట్ డ్ర‌స్ డిజయిన్‌ల‌ను ఆవిడే సెలెక్ట్ చేస్తున్నారు. గ‌తంలో ఆమె ఫ్యాష‌న్ డిజైన‌ర్ చ‌దువుకున్నారు. పెళ్లి త‌ర్వాత ఇంటికే ప‌రిమిత‌మ‌యిన ఆవిడ‌.. ఇప్పుడు చిరంజీవి రీ ఎంట్రీతో కెరీర్‌ను లాంచ్ చేశారు. ఈమూవీలో చిరంజీవి డ్ర‌స్‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

దీనిని ప‌క్క‌న‌పెడితే.. సుష్మిత డిజైన్ డ్ర‌స్‌ల‌ను వేసుకోవ‌డానికి స‌రైనోడు బ్యూటీ కేథ‌రిన్ ట్రెసా నిరాక‌రించింద‌ట‌. సుష్మిత ఎంపిక చేసిన డ్ర‌స్‌లు బాగాలేవ‌ని, క‌ల‌ర్ కాంబినేష‌న్‌లు మ్యాచ్ కాలేద‌ని తెలిపింద‌ట కేథ‌రిన్‌. అయినా, సుష్మిత కేర్ చెయ్య‌లేదట‌. ఆ డ్ర‌స్‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని ఆర్డ‌ర్ కూడా పాస్ చేసింద‌ట‌. దీంతో, వివాదం బాగా ముదిరింద‌ట‌. స‌రిగ్గా ఇదే టైమ్‌లో ద‌ర్శ‌కుడితోపాటు లారెన్స్ కూడా ఇద్ద‌రికీ న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసినా ఎక్క‌డా వ‌ర్క‌వుట్ కాలేద‌ని ప్రచారం జ‌రుగుతోంది. దీంతో, అటు సుష్మిత‌, ఇటు, కేథ‌రిన్ మొండి ప‌ట్టుద‌ల‌కు పోవ‌డంతో కేథ‌రిన్‌కు స్పాట్ ప‌డింద‌ట‌. సినిమా నుంచి ఆమె ఔట్ అని స‌మాచారం ఇచ్చార‌ట‌.

అంతే, చిరంజీవితో ఐటెం సాంగ్‌ని చెయ్యాల‌ని ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా వ‌చ్చిన కేథ‌రిన్‌కి చివ‌రికి ఇలా నిరాశ మిగిలింద‌ట‌. ఏమ‌యినా మెగా డాట‌రా? మ‌జాకా? అంటున్నారు సినీ జ‌నాలు. అంతేలే, రాజుగారు త‌లచుకుంటే.. దెబ్బ‌ల‌కు కొదువా…? అన్న‌ట్లు.. పెద్దోళ్లు ఏం చేసినా చెల్లుతుంది అంటే ఇదేనేమో..? అని చెవులు కొరుక్కుంటున్నారు గాసిప్‌రాయుళ్లు.

Loading...

Leave a Reply

*