ఎన్టీఆర్‌తో ద‌ర్శ‌కేంద్రుడు.. 150 కోట్లతో ఫాంట‌సీ మూవీ..!

ntr-and-raghavenra-rao

ఓ చారిత్ర‌క మూవీకి తెర‌లేస్తోంద‌ట‌. తార‌క్‌తో ఓ భారీ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కేంద్రుడు. ప్ర‌స్తుతం న‌మో వెంక‌టేశాయ చిత్రంతో బిజీగా ఉన్న రాఘ‌వేంద్ర‌రావు.. త్వ‌ర‌లోనే దీనిపై వ‌ర్క‌వుట్ షురూ చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. దర్శ‌కేంద్రుడు చెప్పిన స్టోరీ లైన్‌కి యంగ్‌టైగ‌ర్ ఓకే చెప్పాడ‌ని, సంక్రాంతి త‌ర్వాత రాఘ‌వేంద్ర‌రావు ఫుల్ ఫోక‌స్ పెడ‌తాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

జ‌న‌తా గ్యారేజ్‌తో తార‌క్ క్రేజ్ మ‌రింత పెరిగింది. ఇటు, ఆయ‌న మార్కెట్ కూడా ఇంక్రీజ్ అయింది. దీనికితోడు, ఈ త‌రం హీరోల‌లో చాంతాడంత డైలాగులు, మ‌హాభారతం, రామాయ‌ణం వంటి పౌరాణిక పాత్ర‌లలో న‌టించాలంటే ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్య‌మ‌నే పేరుంది. అందుకే, తార‌క్ లేకుంటే త‌న డ్రీమ్ ప్రాజెక్ట్‌ మ‌హాభార‌తాన్నే ప‌క్క‌న పెడ‌తాన‌ని ప‌లు మార్లు చెప్పాడు రాజ‌మౌళి.

ఈ విష‌యం ఎలా ఉన్నా.. రాఘ‌వేంద్ర‌రావు అనుకుంటున్న క‌థ‌కు యంగ్ టైగ‌ర్ అయితేనే ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాడ‌. ఇది ఓ ఫాంట‌సీ క‌థ అని స‌మాచారం. నిన్ను చూడాల‌ని సినిమాతో తార‌క్ టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైనా.. ఆయ‌న‌కు తొలి స‌క్సెస్‌ను అందించిన మూవీ స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్‌. రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ద‌ర్శ‌కేంద్రుడు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ అందించారు. అయితే, అన్న‌మయ్య‌, శ్రీరామ‌దాసు వంటి ఆధ్యాత్మిక చిత్రాల‌ను తీసిన ద‌ర్శ‌కేంద్రుడు జ‌గ‌దేకవీరుడు అతిలోక‌సుంద‌రి లాంటి ఫాంట‌సీ సినిమాని కూడా తెర‌కెక్కించాడు. రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ట్ చెయ్య‌బోయే ఫాంట‌సీ క‌థ తెలుగు, త‌మిళ్‌తో పాటు హిందీలోనూ ఒకేసారి విడుద‌ల అవుతుంద‌ట‌. బాహుబ‌లితో రాజ‌మౌళికి వ‌చ్చిన క్రేజ్‌ని, ఇమేజ్‌ని తాను యూజ్ చేసుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట రాఘ‌వేంద్ర‌రావు. జ‌క్క‌న్న ఆయ‌న శిష్యుడే కావ‌డంతో ఆయ‌న కూడా ఈ సినిమా క‌థ‌లో ఇన్‌వాల్వ్ అయ్యే చాన్స్ ఉంద‌ట. మొత్తానికి శిష్యుడుని మించి సినిమా చెయ్యాల‌ని రాఘ‌వేంద్ర‌రావు తెగ ఆరాట‌ప‌డుతున్నారు. చూద్దాం.. ఆయ‌న ఎలాంటి అవుట్ పుట్ ఇస్తారో..?

Loading...

Leave a Reply

*