మెగా ఫ్యామిలీపై తెలంగాణ అభిమానులు ఆగ్ర‌హం..!

mega-family

మామూలుగా కాదు… ఒక రేంజ్ లో మెగా కుటుంబంపై ఫ్యాన్స్ కు కోపం వస్తోంది. దీనికి మొన్నటివరకు ఒక కారణం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కారణాలు రెండయ్యాయి. అగ్నికి ఆజ్యం తోడయింది. కోపం డబుల్ అయింది. దీంతో మెగా కాంపౌండ్ డైలమాలో పడింది. ఫ్యాన్స్ ను దువ్వే పనిలో బిజీ అయింది. ఇప్పుడు మేటర్ లోకి వెళ్దాం

సరిగ్గా 2 రోజుల కిందట మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఓ ప్రెస్ నోట్ ఈ కోపానికి కారణమైంది. అదేంటంటే.. ధృవ సినిమా ఆడియో ఫంక్షన్ లేదంటూ వచ్చిన ప్రెస్ నోట్. చెర్రీ సినిమాకు ఆడియో ఫంక్షన్ పెడితే, ఫస్ట్ పండగ చేసుకునే ఫ్యాన్స్.. తెలంగాణ నుంచే ఉంటారు. ఎఁదుకంటే.. ఈవెంట్ హైదరాబాద్ లో ఉంటుంది కాబట్టి. అలాంటి మెగా ఈవెంట్ ను రద్దుచేయడంతో తెలంగాణ మెగా ఫ్యాన్స్ ఉసూరుమన్నారు.

ఇది చాలదన్నట్టు ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను బెజవాడలో పెడతారనే టాక్ వినిపిస్తోంది. దీంతో తెలంగాణ మెగాభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గతంలో సరైనోడు విషయంలో కూడా ఇలానే జరిగింది. హైదరాబాద్ లో పెట్టాల్సిన ఆడియోను రద్దుచేశారు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను విశాఖలో పెట్టారు. ఇప్పుడు ధృవ విషయంలో కూడా అదే జరుగుతుండడంతో.. మెగా కాంపౌండ్ పై చాలా కోపంతో ఉన్నారు తెలంగాణ అభిమానులు.

Loading...

Leave a Reply

*