ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా… మార్నింగ్ షో రివ్యూ…!

untitled-1

మూవీ.. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా
న‌టీన‌టులు.. నిఖిల్‌, నందితా శ్వేత‌, హెబా ప‌టేల్‌,
సినిమాటోగ్ర‌ఫీ.. సాయి శ్రీరామ్‌
మ్యూజిక్‌.. శేఖ‌ర్ చంద్ర‌
ఎడిటింగ్‌.. చోటా.కె. ప్రసాద్‌
మాట‌లు.. అబ్బూరి ర‌వి
నిర్మాత‌.. మేఘ‌నా ఆర్ట్స్‌
క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం.. వీఐ ఆనంద్‌

క‌థ‌ల ఎంపిక‌లో నిఖిల్‌ది ప్ర‌త్యేక‌మైన శైలి. స్వామిరారా, కార్తికేయ‌, సూర్వ వ‌ర్సెస్ సూర్య వంటి విల‌క్ష‌ణ క‌థ‌ల‌తో ఆక‌ట్టుకున్న నిఖిల్‌.. గ‌తేడాది శంక‌రాభ‌ర‌ణంతో కాస్త త‌డ‌బ‌డ్డాడు. అందుకే, ఏడాది గ్యాప్ తీసుకున్నా ప‌క్కా స‌క్సెస్‌పై క‌న్నేశాడు. మ‌రోసారి థ్రిల్ల‌ర్ క‌థ‌కు ఓటేశాడు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా అంటూ టైటిల్‌తోనే ఆక‌ట్టుకున్నాడు. టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌రి, సినిమా సంగ‌తేంటి..? క‌థ‌, క‌థ‌నం ఎలా ఉంది..? నిఖిల్ హిట్ కొట్టాడా..? లేదా..? అనేది చూద్దాం..

హీరో ఈ సినిమాలో బాహుబ‌లి సినిమాకి ప‌నిచేసే గ్రాఫిక్ డిజైన‌ర్‌గా క‌నిపిస్తాడు. చ‌నిపోయిన త‌ర్వాత మ‌నిషి ఆత్మ‌, దాని బ‌రువు.. వంటి విల‌క్ష‌ణ అంశం చుట్టూ క‌థ తిరుగుతుంది. దీనిని రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా దీనిని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్‌. ఇద్ద‌రు హీరోయిన్‌ల‌తో ల‌వ్ ట్రాక్ న‌డుపుతాడు హీరో నిఖిల్‌. అనూహ్య ప‌రిణామాల‌తో ఆయ‌న ఓ ప‌రిశోధ‌న చేయాల్సి వ‌స్తుంది.. దీనితో క‌థ విల‌క్ష‌ణ మ‌లుపులు తీసుకుంటుంది.. ఆత్మ‌, మ‌నిషి వంటి వైవిధ్య‌మైన అంశాలపై తిరుగుతుంది ఈ క‌థ‌. మ‌రి, ఇటు ప్రేమ‌ను, అటు ఓ వెర‌యిటీ కాన్సెప్ట్‌ని అనుసంధానం చెయ్య‌డంలో ద‌ర్శ‌కుడు వెండితెర‌పై మేజిక్ చేశాడ‌ని చెబుతున్నారు ప్రేక్ష‌కులు. ద‌ర్శ‌కుడు ఆనంద్ ప‌క్కాగా రాసుకున్న క‌థ, క‌థ‌నం సినిమాకి హైలైట్‌గా మారిందంటున్నారు వీక్ష‌కులు.

రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్‌ల‌తో హీరో రొమాన్స్ అదిరిపోయింది. హెబ్బా ప‌టేల్‌, నందితా శ్వేతా గ్లామ‌ర్ సినిమాకి అడ్వాంటేజ్‌గా మారిందంటున్నారు. ఇక‌, సినిమాలో థ్రిల్ల‌ర్ ఎపిసోడ్స్ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా రేంజ్‌ని అమాంతం పెంచేలా ఉన్నాయంటున్నారు. గ్రాఫిక్స్ కూడా బాగా ప్ల‌స్ అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. క‌థ మ‌ధ్య‌లో అక్క‌డక్కడా వచ్చే ట్విస్ట్‌లు, వాటిని ద‌ర్శ‌కుడు ఆనంద్ డీల్ చేసిన తీరు ఆక‌ట్టుకున్నాయంటున్నారు. సిచ్యువేష‌న‌ల్ కామెడీ కూడా బావుంద‌నే టాక్ వినిపిస్తోంది.

ఫ‌స్ట్ హాఫ్ ఎంట‌ర్‌ట‌యినింగ్‌గా సాగిపోతుంది. ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. ఇంట‌ర్‌వెల్ సీన్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాడ‌ట ద‌ర్శ‌కుడు. సెకండాఫ్‌లో నందితా శ్వేత న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. అవికా గోర్ స్పెష‌ల్ రోల్ సినిమాకి మరో ఎట్రాక్ష‌న్‌. కుమారి హెబ్బా ప‌టేల్ గ్లామ‌ర్ సినిమాకి కావాల్సినంత మ‌సాలాని యాడ్ చేసింద‌ట‌. ప్ర‌తి ఫ్రేమ్‌ని సినిమాటోగ్రాఫ‌ర్ సాయి శ్రీరామ్ అందంగా ప్రెజెంట్ చేశాడు. మ్యూజిక్ కూడా చాలా బావుంది.

మొత్త‌మ్మీద‌, నిఖిల్‌కి మ‌రో హిట్ గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. రీసెంట్‌గా టాలీవుడ్‌కి మంచి హిట్ లేక‌పోవ‌డంతోపాటు, మంచి సినిమా కూడా రాలేదు. ఈ ఒక్క సినిమాతో చిన్న‌వాడు.. ఆ రెండింటిని సాధించాడ‌ని చెప్పొచ్చు..

బాట‌మ్‌లైన్‌.. ఇక్క‌డే ఉంటావు చిన్న‌వాడా…!

Loading...

Leave a Reply

*