ధృవ సినిమాకు వెరైటీ ప్రమోషన్

untitled-46

ధృవ సినిమాకు సంబంధించి ప్రచారంలో కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆడియో ఫంక్షన్ ను రద్దు చేశారు. త్వరలోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెడతారట. పాటల్ని నేరుగా 9వ తేదీన మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. అంతకంటే ముందు ప్రతి పాటకు సంబంధించిన సాంగ్ టీజర్ ను యూట్యూబ్ లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని పాటల టీజర్లు వచ్చేశాయి. ఈరోజు, రేపు ఇంకొన్ని టీజర్లు కూడా వచ్చేస్తాయంటున్నారు.

మరోవైపు తాజాగా పూర్తిచేసిన ఇంట్రోసాంగ్ టీజర్ కూడా రెడీ అయిపోయిందట. పాటల విడుదల రోజున ఆ ఇంట్రోసాంగ్ టీజర్ ను విడుదల చేస్తారట. ఇది చాలదన్నట్టు.. ఇప్పుడు స్పెషల్ గా ఓ యాప్.. ఇంకా ఓ వెబ్ సైట్ ను తయారుచేస్తున్నారట. ఆడియో విడుదలైన రోజు నుంచి ఈ యాప్, వెబ్ సైట్ పని ప్రారంభిస్తాయట. సినిమాకు సంబంధించిన సమస్త సమాచారం ఇందులో ఉంటుందని తెలుస్తోంది.

ఇలా ధృవ సినిమాకు సంబంధించి వినూత్నంగా ప్రచారాన్ని ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్ టీం. అంతేకాకుండా… సినిమా విడుదలకు ముందు ఇచ్చే ఇంటర్వ్యూల్లో కూడా ఓ కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలని అనుకుంటున్నారట. అదేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. దశల వారీగా మీడియా ఛానెళ్లను మేనేజ్ చేస్తూ, ప్రమోషన్లు ఇవ్వాలని భావిస్తున్నారట.

Loading...

Leave a Reply

*