హవ్వ… ఇదేం ప్రచారం చెర్రీ…

untitled-30

ఓవైపు ప్రచారానికి అత్యంత కీలకమైన ఆడియో ఫంక్షన్ ను కాన్సిల్ చేశారు. మరోవైపు చడీచప్పుడు కాకుండా సాంగ్ బిట్స్ రిలీజ్ చేశారు. ఇదేం ప్రచారమో అర్థంకాక మెగాభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. అవును.. చెర్రీ సినిమాకు సంబంధించి ప్రచారం అనేది లేకుండా పోతోంది. ఏ సినిమాకైనా ఆడియో ఫంక్షన్ తోనే ప్రచారం ప్రారంభం అవుతుంది. అలాంటి ఆడియో ఫంక్షన్ ను లేకుండా చేశారు. సరే.. ఫంక్షన్ పెట్టలేదు. కనీసం టీజర్లు అయినా గ్రాండ్ గా రిలీజ్ చేయాలి కదా.. అది కూడా జరగలేదు

ధృవ ఫస్ట్ లుక్ టీజర్ ఎంత ఆర్భాటంగా విడుదలైందో మనం చూశాం. ఏకంగా 3 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించింది ఆ టీజర్. అంత హైప్ వచ్చిన తర్వాత నెక్ట్స్ టీజర్ రిలీజ్ కు ఎంత హంగామా చేయాలి. కానీ ధృవ టీం ఈ సింపుల్ లాజిక్ ను మిస్ అయింది. చడీచప్పుడు కాకుండా సాంగ్ బిట్స్ విడుదల చేసింది. ఒకటి కాదు.. ఏకంగా 2 సాంగ్స్ బిట్స్ రిలీజ్ చేసింది. అవి రిలీజ్ అయ్యాయనే విషయం కూడా ఎవరికీ తెలీదు.

సాధారణంగా చిరు, బన్నీ, చెర్రీ లాంటి హీరోల టీజర్లు రిలీజైతే.. గంటకే వేలల్లో వ్యూస్ ఉంటాయి. కానీ ధృవ సాంగ్ బిట్ విడుదలైన 5 గంటల తర్వాత కూడా కేవలం 5వేల వ్యూస్ మాత్రమే దక్కించుకుంది. దీనికి కారణం అదొక స్టఫ్ వస్తోందని ఎవరికీ తెలియకపోవడమే. దీంతో హవ్వ.. ఇదేం ప్రచారం అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

Loading...

Leave a Reply

*