తెలంగాణ Vs ఆంధ్రా… చెర్రీ అలా దువ్వాడు….

untitled-29

మెగా కాంపౌండ్ అభిమానుల్లో ఓ బడా చీలక వచ్చిందనే విషయాన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేసిన వారికి అర్థమైపోతుంది. మెగా సినిమాలకు సంబంధించి అభిమానులు తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా మారిపోయారు. ఆడియో పంక్షన్లు హైదరాబాద్ లో పెట్టకుండా ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు ఏపీలో పెట్టడం ఏంటని తెలంగాణ మెగాభిమానులు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. తాజాగా ధృవ ఆడియోతో ఈ విషయం మరోసారి భగ్గుమంది.

ధృవ ఆడియోకు సంబంధించి ఫంక్షన్ పెట్టడం లేదు. ఈనెల 9న ఆడియోను నేరుగా మార్కెట్లోకి విడుదల చేసి… నెలాఖరుకు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టబోతున్నారు. అయితే హైదరాబాద్ లో జరగాల్సిన ఆడియోను క్యాన్సిల్ చేసి, విజయవాడలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెడతారట.ఇదే తెలంగాణ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది.

విషయం చరణ్ వరకు వెళ్లింది. నైజాం మార్కెట్ ఎంత కీలకమో చెర్రీకి తెలియంది కాదు. అందుకే బుజ్జగింపు ప్రయత్నాల్లో పడ్డాడు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు.. తెలంగాణ, ఏపీకి సంబంధించి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులకు గత రాత్రి చెర్రీ పెద్ద పార్టీ కూడా ఇచ్చాడట. ఈ పార్టీలోనే ఫ్యాన్స్ నాయకుల్ని బాగా దువ్వాడని తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*