మెగా బ్రేకింగ్.. ధృవ మరో సారి వాయిదా…

untitled-14

ధృవ సినిమా ఇప్పటికే ఓసారి వాయిదాపడిన సంగతి మనందరికీ తెలిసిందే. మొన్న దసరా బరిలోనే ధృవ సినిమాను దించుతామని ప్రకటించిన నిర్మాత అల్లు అరవింద్… ఆ తర్వాత దసరా దగ్గరకొచ్చేసరికి తూచ్ అన్నాడు. తర్వాత తాపీగా డిసెంబర్ లో విడుదల చేస్తామంటూ ఓ ప్రెస్ నోట్ జారీచేశాడు. కానీ ఇప్పుడు ఆ మాట నుంచి కూడా వెనక్కి తగ్గబోతున్నాడు మెగా ప్రొడ్యూసర్. అవును… తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. డిసెంబర్ లో కూడా ధృవ వచ్చేది డౌటే.

నిజానికి ఈనెల చివర్లో ధృవ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా చేయాలని ఫిక్స్ అయ్యారు. పాటల్ని కూడా ఇప్పటికే మార్కెట్లోకి నేరుగా విడుదల చేశారు. సోషల్ మీడియాలో మేకింగ్ షాట్స్ తో ప్రచారం కూడా భారీగానే ప్రారంభించారు. మరోవైపు సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ధృవ షూటింగ్ పూర్తి అంటూ ఫొటోలు కూడా పెట్టేశారు. కానీ అంతలోనే వచ్చేనెలలో సినిమా విడుదల కావట్లేదనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం నరేంద్రమోడీ.

అవును… మోడీ పెద్ద నోట్ల దెబ్బ ధృవ సినిమాపై కూడా పడిందట. 500, 1000 నోట్లను ఉన్నఫలంగా రద్దుచేయడంతో… ధృవ సినిమా విడుదల ఇప్పుడు గందరగోళంలో పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పాటు… పబ్లిసిటీ పనులు కూడా పెద్ద నోట్ల రద్దుతో డైలమాలో పడినట్టు తెలుస్తోంది. లక్కీగా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి… ఎఫెక్ట్ కాస్త తక్కువే అని చెప్పాలి.

Loading...

Leave a Reply

*