ఎన్టీఆర్ కొత్త‌ సినిమా ఫిక్స్‌.. డైరెక్ట‌ర్ క‌న్‌ఫ‌మ్ అయ్యాడోచ్‌…!

ntr

యంగ్‌టైగ‌ర్ నిరీక్ష‌ణ ఫ‌లించిందా..? ఆయ‌న‌కు ద‌ర్శ‌కుడు దొరికాడా.? రెండు నెల‌లుగా తార‌క్ ఓ బ‌డా ద‌ర్శ‌కుడి కోసం నిరీక్షిస్తున్నాడు. జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్‌ని క్యాష్ చేసుకోవ‌డమే ప్రెజెంట్ ఆయ‌న టార్గెట్‌. అందుకే, ఎంద‌రో అగ్ర‌ ద‌ర్శ‌కులు త‌న‌తో సినిమా చెయ్య‌డానికి వ‌చ్చినా వారికి సున్నితంగా నో చెప్పాడు. మ‌రికొంద‌రికి దూరం జ‌రిగాడు. అయితే, తాజాగా ఆయ‌న కొత్త సినిమా ఫిక్స్ అయిన‌ట్లు స‌మాచారం.

ఓ త‌మిళ్ డైరెక్ట‌ర్‌తో యంగ్‌టైగ‌ర్ కొన్నాళ్లుగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌. ఆయ‌న చెప్పిన స్టోరీ లైన్ తార‌క్‌కి విప‌రీతంగా న‌చ్చింద‌ట‌. వెంట‌నే దానిని డెవ‌ల‌ప్ చెయ్యాల‌ని సూచించాడ‌ట‌. దీంతో, ఆ డైరెక్ట‌ర్ ర‌ఫ్‌గా చెప్పిన క‌థ తెగ న‌చ్చ‌డంతో.. ఆ డైరెక్ట‌ర్‌ని ఫుల్ లెంగ్త్ స్టోరీ సిద్ధం చెయ్యాల‌ని తెలిపాడ‌ట‌. ఇన్నాళ్లూ తమిళ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కే ప‌రిమిత‌మ‌యిన ఆ ద‌ర్శ‌కుడు.. తార‌క్ ఇచ్చిన బూస్ట‌ప్‌తో టాలీవుడ్‌లోనూ ఫోక‌స్ పెట్టే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. అందుకే, ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్‌ని రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట ఆ డైరెక్ట‌ర్‌.

ఆ డైరెక్ట‌ర్ రీసెంట్‌గా కూడా ఓ త‌మిళ్ సినిమాతో స‌క్సెస్ అందుకున్నాడని తెలుస్తోంది. ఆయ‌న‌కు కోలీవుడ్‌లో మార్కెట్ ఉంద‌ని, కాజ‌ల్ లాంటి హీరోయిన్ అయితే అక్క‌డ కూడా సినిమా రిలీజ్ చెయ్యొచ్చ‌ని దీంతో.. ఈ సినిమాతో త‌మిళ్ మార్కెట్‌లోనూ పాగా వేయొచ్చ‌ని భావిస్తున్నాడ‌ట తార‌క‌. అందుకే, ఆయ‌న‌ని ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం. దీనిపై రేపో మాపో ఎన్టీఆర్ టీమ్ నుంచి క‌బురు రానుంద‌ట‌. ఇందులో నిజ‌మెంత అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*