ప‌వ‌న్‌, ప్ర‌భాస్ అంటే మ‌హేష్‌కు భ‌య‌మా?

mahesh

ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నా, ప్ర‌భాస్ అన్నా మ‌హేష్‌బాబుకు భ‌యమా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఇది టాక్ ఆఫ్ ది టౌన్ అయింది… ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఇలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి…. గ‌తంలో కూడా వాళ్లిద్ద‌ర్ని చూసి టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ భ‌య‌ప‌డ్డాడ‌ని ఇప్పుడు మ‌రోసారి భ‌య‌ప‌డుతున్నా డ‌ని సినీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి.. అస‌లు విష‌యం ఏంటంటే…. టాలీవుడ్‌లో సూప‌ర్ స్టార్ మహేష్‌బాబుకు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బీభ‌త్స‌మైన క్రేజ్ ఉంది….ఆ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుద‌ల అవుతున్నాయంటే టాలీవుడ్‌లో సినిమా పండగ వ‌చ్చేసి న‌ట్టే. ఈ ఇద్ద‌రి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయి క్లాష్‌ కాకుండా నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు…

అయితే తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న కాట‌మ‌రాయ‌డు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన వెంట‌నే ప్రిన్స్ మ‌హేష్‌బాబు అయోమ‌యంలో ప‌డిపోయాడు… కార‌ణం ఏంటంటే… మ‌హేష్‌-మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సినిమాను వ‌చ్చే ఏడాది మార్చి నెలాఖ‌రులో రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేసింది….ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత భారీగా తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి2 ఏప్రిల్ నెలాఖ‌రులో రానుండ‌డంతో తన‌ సినిమాను ఒక నెల ముందుగా రిలీజ్ చేయాల‌ని మ‌హేష్ భావిస్తున్నాడు…. అప్పుడు క‌లెక్ష‌న్ల విష‌యంలో ఆ సినిమాతో పోటీ ఉండ‌ద‌ని ఈ జాగ్ర‌త్త తీసుకున్నాట్ట సూప‌ర్‌స్టార్‌….అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన‌ కాట‌మ‌రాయుడు సినిమాను మార్చి 29న రిలీజ్ చేస్తామ‌ని ఆ సినిమా యూనిట్ అనౌన్స్ చేయ‌డంతో మ‌హేష్ గుండెల్లో రాయి ప‌డింది…

తాను కూడా మార్చి నెలాఖ‌రుకే సినిమాను రిలీజ్ చేస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పోటీ ప‌డాలి… క‌లెక్ష‌న్లు పంచుకోవాలి…. అలా కాకుండా ఒక నెల త‌ర్వాత సినిమా రిలీజ్ చేస్తే బాహుబ‌లి వ‌చ్చి కుమ్మేస్తాడు… మ‌రో నెల త‌ర్వాత రిలీజ్ చేస్తే స‌మ్మ‌ర్ అయిపోతుంది…. విద్యార్థుల‌కు హాలీడేస్ అయిపోతాయి… కలెక్ష‌న్ల విష‌యంలో దెబ్బ త‌ప్ప‌దు… దీంతో ప‌వ‌న్‌, ప్ర‌భాస్ వ‌చ్చి త‌న కొంప ముంచార‌ని మ‌హేష్ వాపోతున్నాట్ట‌. అయితే సినిమాలో ద‌మ్ముంటే ఎప్పుడు రిలీజ్ చేసినా ఆడుతుంద‌ని సినీ రంగంలో సీనియ‌ర్ పండితులు స‌ల‌హా ఇస్తున్నారు.

Loading...

Leave a Reply

*