ఆ కథపై మహేష్ కన్ను కూడా పడింది..

untitled-3

తెలుగులో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ మూవీ ఫార్మాట్ ఏదైనా ఉందంటే అది హారర్ కామెడీ మాత్రమే. కాస్త భయపెట్టి, ఇంకాస్త నవ్వించి, ఆఖర్లో సెంటిమెంట్ రుద్ది.. థియేటర్ల నుంచి ఆడియన్స్ ను మిక్స్ డ్ ఫీలింగ్స్ తో బయటకు పంపిస్తే సినిమా హిట్ అయిపోతోంది. తాజాగా వచ్చిన అభినేత్రి కూడా ఇదే ఫార్మాట్ లో కాసులు కొల్లగొడుతోంది. ఈ సినిమా సెకెండాఫ్ లో కామెడీ జనాలకు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ కన్ను ఇలాంటి టైపు కథలపై పడినట్టు చెప్పుకుంటున్నారు.

మహేష్ కుటుంబంలో ఉన్న సుధీర్ బాబు ఇప్పటికే ప్రేమకథాచిత్రమ్ పేరుతో ఈ టైపు సినిమా చేశాడు. ఇప్పుడు మహేష్ కూడా అలాంటి సినిమానే చేయాలనుకుంటున్నాడట. ఈ మేరకు త్రివిక్రమ్-మహేష్ బాబు మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ సినిమాలో నటిస్తున్నాడు. ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ సినిమా తర్వాత తన 25వ సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలనుకుంటున్నాడట మహేష్.

తన సిల్వర్ జూబ్లీ మూవీ ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడట మహేష్. ఇప్పటివరకు చేయని డిఫరెంట్ సబ్జెక్ట్ చేయాలనుకుంటున్నాడట. అందుకే త్రివిక్రమ్ ను హారర్-కామెడీ సబ్జెక్ట్ కావాలని కోరాడట. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలీదు కానీ, మహేష్ డెసిషన్ మాత్రం కరెక్ట్ అంటున్నారు చాలామంది.

Loading...

Leave a Reply

*