సీతమ్మవాకిట్లో మరో చెట్టు మొలుస్తుందా…?

sita

సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే మూడేళ్ల కిందట సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా ఈ జనరేషన్ లో సిసలైన మల్టీస్టారర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. దిల్ రాజుకు ఎనలేని పేరు తీసుకొచ్చింది. తన బ్యానర్ లో బొమ్మరిల్లు సినిమా తర్వాత దిల్ రాజు.. ఈ సినిమాతో ఆ క్రేజ్ ను డబుల్ చేసుకున్నాడు. ఇప్పుడు రాజు గారు అలాంటిదే మరో సినిమా చేయాలని తహతహలాడుతున్నాడట. అంటే.. సీతమ్మవాకిట్లో మరో చెట్టు మొలవబోతోందన్నమాట.

సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా తరహాలోనే కుటుంబనేపథ్యంలో సాగే మరో మల్టీస్టారర్ కథ ఒకటి దిల్ రాజు దగ్గరకు వచ్చింది. కుదిరితే ఈ సినిమాలో నాగార్జున, మహేష్ బాబును హీరోలుగా పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయాలని దిల్ రాజు అనుకుంటున్నాడట. నిజానికి ఈ కాంబినేషన్ ను గతంలోనే మణిరత్నం ట్రైచేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడు.

మరోవైపు నాగ్-దిల్ రాజు మధ్య సంబంధాలు అంత పెద్దగా లేవనే టాక్ నడుస్తోంది. ఈమధ్యే దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సిన నాగార్జున.. రెమ్యునరేషన్ విషయంలో తేడాలొచ్చి ఆఖరి నిమిషంలో తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సీతమ్మవాటిలో టైపు మల్టీస్టారర్ లో నటిస్తాడా అనేది అనుమానమే. దిల్ రాజు మదిలో ఉన్న ఈ భారీ మల్టీస్టారర్ ఎప్పటికి సాకారం అవుతుందో చూడాలి.

Loading...

Leave a Reply

*