డైరెక్ట‌ర్ ఇత‌డా…? బాంబ్ పేల్చ‌డానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్‌….?

did-ntr-finalized-pataas-anil-ravipudi-script

ఎన్టీఆర్ కొత్త సినిమా దాదాపు ఫైన‌లైజ్ అయింద‌నే వార్త టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. రీసెంట్‌గా ఆయ‌న ప‌లు సినిమా క‌థ‌లు విన్నాడ‌ని, అందులో ఓ త‌మిళ్ డైరెక్ట‌ర్ చెప్పిన స్టోరీ లైన్ ఆయ‌న‌కు బాగా న‌చ్చింద‌ని, దానికే క‌మిట్ అవుతున్నాడ‌ని రెండు రోజులుగా టాలీవుడ్‌లో ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అది ఓ బాలీవుడ్ లేదా కోలీవుడ్ రీమేక్ అయ్యే చాన్స్ ఉంద‌నే మాట కూడా వినిపించింది. అయితే, ఇప్పుడు అవ‌న్నీ తూచ్ అయ్యాయ‌ని, అది స్ట్ర‌యిట్ మూవీయేన‌ని, టాలీవుడ్‌లోని ఓ యువ ద‌ర్శ‌కుడికి చాన్స్ ఇచ్చిన‌ట్లు మ‌రో కొత్త వార్త వెలుగులోకి వ‌చ్చింది.

ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు.. ప‌టాస్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి అట‌. గ‌త వారం రోజులుగా ఎన్టీఆర్ ఎన్నో క‌థ‌లు విన్నాడ‌ని, వాటిల్లో అనిల్ రావిపైడి చెప్పిన క‌థ ఫైన‌లైజ్ చేశాడ‌ని ఓ టాప్ ప‌త్రిక క‌థ‌నం రాసింది. కల్యాణ్‌రామ్ ప‌టాస్‌తో కెరీర్ ప్రారంభించిన అనిల్ రావిపూడి ఆ త‌ర్వాత సాయి ధ‌ర‌మ్ తేజ‌తో సుప్రీమ్ సినిమా చేశాడు. ఇది యావ‌రేజ్‌గా నిలిచింది. అయితే, అనిల్ చెప్పిన స్టోరీ లైన్ న‌చ్చ‌డంతో ఏకంగా వారం రోజులుగా అదే స్క్రిప్ట్‌పై వ‌ర్క్ చెయ్య‌మ‌న్నాడ‌ట తార‌క్‌. దీంతో, దానిపైనే కూర్చున్న అనిల్ టీమ్‌.. ఫైన‌ల్‌గా క‌థ‌ను ఓ కొలిక్కి తెచ్చిందని, ఇది అంద‌రికీ న‌చ్చింద‌ని స‌మాచారం.

జ‌న‌తా గ్యారేజ్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర్వాత తారక్ చెయ్య‌బోయే సినిమాపై ఆస‌క్తి పెరిగింది. ఎంద‌రో బ‌డా ద‌ర్శ‌కుల‌ను ట్రై చేసినా అంతా బిజీగా ఉండడంతో ఆయ‌న అప్‌క‌మింగ్ డైరెక్ట‌ర్‌ల‌వైపు చూడాల్సిన సిచ్యువేష‌న్‌. అందుకే, ప‌టాస్ డైరెక్ట‌ర్‌ని ఫైన‌లైజ్ చేశాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

Loading...

Leave a Reply

*