రామ్‌చ‌ర‌ణ్ ధృవ టీజ‌ర్ రిలీజ్‌.. ఎలా ఉందంటే..?

dhruva

చెర్రీ లేటెస్ట్ మూవీ ధృవ‌. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది ఈ చిత్రం. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నాడు మెగాప‌వ‌ర్ స్టార్‌. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయింది. 56 సెక‌న్‌ల నిడివితో విడుద‌ల‌యిన ఈ టీజ‌ర్ ఇంప్రెస్సివ్‌గా ఉంది. త‌మిళ్ మూవీ త‌ని ఒరువ‌న్‌కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పోలీస్ స్టోరీ.పోలీస్ పాత్ర‌ల‌ను, స్టోరీల‌ను డీల్ చెయ్య‌డంలో సురేంద‌ర్ రెడ్డి సెప‌రేట్ స్ట‌యిల్‌. అందుకే, మెగా కాంపౌండ్ ఆ బాధ్య‌త‌ను స్ట‌యిలిష్ డైర‌క్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డికి అప్ప‌గించింది. టీజ‌ర్‌లో వ‌చ్చిన డైలాగ్ బావుందంటున్నారు మెగా ఫ్యాన్స్‌. హీరో-విల‌న్ మైండ్‌గేమ్ నేప‌థ్యంలో న‌డిచే ఈ సినిమాకి.. టీజ‌ర్ డైలాగ్ అతికిన‌ట్లు స‌రిపోయింద‌ని చెబుతున్నారు.

టీజ‌ర్‌లో కాస్త థ్రిల్ ట‌చ్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.ప్ర‌స్తుతం షూటింగ క్ల‌యిమాక్స్‌కు చేరుకున్న ధృవ‌ని అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నాడు. దాదాపు చాలా గ్యాప్ త‌ర్వాత గీతా ఆర్ట్స్ న‌టిస్తున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. అయితే, సినిమా ప్ర‌మోష‌న్‌ని మాత్రం అల్లు టీమ్‌కి దూరంగా ఉంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న్ విష‌యంలో అల్లు టీమ్‌కి, చెర్రీకి మ‌ధ్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. త్వ‌రలోనే ఆడియో రిలీజ్ చేసి సినిమా డేట్‌ని ప్ర‌క‌టించాల‌ని భావిస్తున్నారు.

Loading...

Leave a Reply

*