ఆగిపోయిన సినిమాను మళ్లీ పైకి తెస్తాడట…

untitled-12

చరణ్ కెరీర్ లో ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ముహూర్తం షాట్ అయిన తర్వాత ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా ఆగిపోయిన సినిమాల్లో ఒకదాన్ని తిరిగి మళ్లీ సెట్స్ పైకి తీసుకురావడానికి చెర్రీ ప్రయత్నాలు ప్రారంభించాడట. ఆ సినిమానే కొరటాల శివ దర్శకత్వంలో రానుందని తెలుస్తోంది. నిజానికి ఆగిపోయిన సినిమాల్ని మళ్లీ పట్టించుకోవడం మెగా కాంపౌండ్ చరిత్రలోనే లేదు. కాకపోతే…కొరటాల ప్రస్తుతం స్వింగ్ మీదున్నాడు. అందుకే ఆతడితో సినిమా చేసేందుకు చెర్రీ ఈ పనికి దిగాడట.

మరోవైపు ఆగిపోయిన సినిమాను పైకి తీసుకురావడం వెనక ఓ సెంటిమెంట్ కూడా ఉందంటున్నారు. గతంలో ఎన్టీఆర్ తో ఓ సినిమా అనుకొని డ్రాప్ అయ్యాడు కొరటాల. కట్ చేస్తే… మహేష్ బాబు తో హిట్ కొట్టాడు. తర్వాత రామ్ చరణ్ తో ఓ సినిమా స్టార్ట్ చేసి ఆపేశాడు. కట్ చేస్తే… తారక్ తో జనతా గ్యారేజ్ రూపంలో హిట్ కొట్టాడు. ఇలా డ్రాప్ అయిన ప్రతిసారి హిట్ కొడుతున్నాడు కాబట్టి… తను డ్రాప్ చేసిన సినిమా కూడా హిట్ అవ్వొచ్చని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడు చెర్రీ.

ప్రస్తుతం ధృవ సినిమా పనిలో చెర్రీ బిజీగా ఉన్నాడు. వచ్చేనెలలో ఈ సినిమా విడుదల ఉంటుంది. ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు చరణ్. సుకుమార్ సినిమా కంప్లీట్ అయ్యేలేపు, అటు కొరటాల కూడా మహేష్ మూవీని కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్తారట.

Loading...

Leave a Reply

*