రామ్ హైపర్ ను ధోనీ అడ్డుకుంటాడా…      

hyper

హైపర్ సినిమా సెన్సార్ పూర్తయింది. పాజిటివ్ బజ్ ప్రారంభమైంది. సినిమాను ఈనెల 30న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు దగ్గర్లో మరే సినిమా పోటీ లేదు. వారం రోజుల తర్వాత విడుదలకానున్న ప్రేమమ్, అభినేత్రి సినిమాలు మాత్రమే హైపర్ కు పోటీగా భావించారు. కానీ అంతకంటే ముందే హైపర్ కు ధోనీ రూపంలో గట్టిదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.  మూడు భాషల్లో తెరకెక్కిన ధోనీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హైపర్ కు కాస్త పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ధోనీ గురించి తెలియనివారుండరు. సినిమాలో స్టార్ ఎట్రాక్షన్ లేకపోయినా.. ధోనీ జీవితం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.

పైగా తెలుగులో ఈ సినిమాకు రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. సో… బి, సి సెంటర్లు మినహాయిస్తే… కచ్చితంగా ఎ-సెంటర్లలో హైపర్ కు ధోనీ గట్టిపోటీనిస్తాడనేది ఖాయంగా కనిపిస్తోంది.      అటు హైపర్ మేకర్స్ కూడా చాలా పక్కాగానే ఉన్నారు. ధోనీ కంటే ఎక్కువ థియేటర్లు తమకే దక్కేలా స్కెచ్ రెడీ చేసుకున్నారు. కానీ పోటీ మాత్రం తప్పేలా లేదు. మరోవైపు ఓవర్సీస్ లో కూడా హైపర్ కు ధోనీ దెబ్బ తప్పకపోవచ్చు. ఎందుకంటే… ఓవర్సీస్ లో కూడా ధోనీపై మంచి క్రేజ్ నడుస్తోంది. సో.. ధోనీని క్రాస్ చేసుకుంటూ… ఆ వచ్చే వారం రానున్న ప్రేమమ్, అభినేత్రిని ఎదుర్కొంటూ… హైపర్ తన సత్తా చూపించాలన్నమాట.

 

Loading...

Leave a Reply

*