స‌హ‌జీవ‌నం చేసి, మోసం చేసి ల‌వ‌ర్ పారిపోయాడు..!

untitled-7

ఈమెను గుర్తుప‌ట్టారా..? సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మూవీలో మ‌హేష్‌ని పెళ్లి చేసుకుంటావా..? అని అడిగిన భామ‌. పూలు ఇస్తే ఎక్క‌డ పెట్టుకుంటావ్‌..? అని మ‌హేష్ అడిగిన ప్ర‌శ్న‌కు.. సైలెంట్ అయిన ఈ భామ గుర్తుందా..? అవును, ధ‌న్య బాల‌కృష్ణ‌. ఆ త‌ర్వాత రాజుగారి గ‌ది వంటి సినిమాల‌లో ఆమెకు హీరోయిన్‌గా కూడా చాన్స్‌లు వ‌చ్చాయి. రెయిజింగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ధ‌న్య బాల‌కృష్ణ రీసెంట్‌గా త‌ను వ‌చ్చేనంట మూవీలో మ‌రో లీడ్ రోల్‌లో న‌టించింది. ర‌ష్మి మెయిన్ పాత్ర‌లో క‌నిపించిన ఈ సినిమాలో ధ‌న్య‌ది కూడా గుర్తుంచుకోద‌గ్గ పాత్రే.

హీరోయిన్ ఫ్రెండ్‌గానో, హీరో ఎక్స్ ల‌వ‌ర్‌గానో, గాళ్‌ఫ్రెండ్‌గానో క‌నిపించే ఈ బ్యూటీ ఇటీవ‌ల ఓ ఇంట‌రెస్టింగ్ మేట‌ర్ లీక్ చేసింది. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌య‌మే అయినా మీడియాతో షేర్ చేసుకుంది. గ‌తంలో తాను ఓ అబ్బాయిని ప్రేమించింద‌ట‌. ఇద్ద‌రి అభిప్రాయాలు న‌చ్చ‌డంతో మ్యారేజ్ చేసుకునేదాకా వెళ్లింద‌ట మేట‌ర్‌. దీంతో, కొంత‌కాలం క‌లిసి ఆ అబ్బాయితో స‌హ‌జీవ‌నం చేసింద‌ట‌. అంటే.. ఒకే రూమ్‌లో ఉండ‌డం అన్న‌మాట‌.

ఇలా, లివింగ్ రిలేష‌న్ షిప్‌లో ఉన్న ఆమెను మోసం చేసి పారిపోయాడ‌ట ఆ ల‌వ‌ర్‌. నీమీద ఇంట‌రెస్ట్ త‌గ్గింది.. వేరే అమ్మాయి మీద ల‌వ్ పెరిగింది అంటూ జారుకున్నాడ‌ట గురుడు.ఆ మాట‌కు మొద‌ట షాక్ తిన్నా.. ఆ త‌ర్వాత త‌న‌ను తాను సంభాళించుకున్నాన‌ని, జీవితం అన్న త‌ర్వాత న‌డ‌వాలి కదా..? అక్క‌డితో ఆగిపోదు క‌దా..? అంటూ ఆమె వివ‌రించింది. మొత్త‌మ్మీద‌, సినిమాటిక్ ట్విస్ట్ ఉంది క‌దా ధ‌న్య బాల‌కృష్ణ రియ‌ల్ లైఫ్‌లో.

Loading...

Leave a Reply

*