షాకింగ్.. త్రిష మ్యారేజ్ బ్రేకప్ వెనుక ర‌జనీకాంత్ అల్లుడు ర‌ఘువ‌ర‌న్‌..!

trisha

రీసెంట్‌గా త్రిష పెళ్లి పీట‌ల‌దాకా వ‌చ్చిన‌ త‌న మ్యారేజ్ బ్రేక‌ప్‌పై కొన్ని వాస్త‌వాలు బ‌య‌ట పెట్టింది. పెళ్లితర్వాత సినిమాల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని వ‌రుణ్ మనియ‌న్ ఫ్యామిలీ కండిష‌న్ విధించింద‌ని చెప్పింది. ఆ ష‌ర‌తు త‌న‌కు ఇష్టం లేద‌ని, మ్యారేజ్ తర్వాత కూడా తాను న‌టిస్తాన‌ని చెప్పాన‌ని, దానికి వారు ఒప్పుకోక‌పోవ‌డంతోనే పెళ్లి చెడిపోయింద‌ని వివ‌రించింది.

ఇది ఓ యాంగిల్ మాత్ర‌మే అని.. అస‌లు కార‌ణం మాత్రం ధ‌నుష్ అని స‌మాచారం. ఆయనెలా సీన్‌లోకి ఎంట‌ర్ ఇచ్చాడ‌నుకుంటున్నారా? ధ‌నుష్‌, వ‌రుణ్ మానియ‌న్‌కి మ‌ధ్య ఏవో చిన్న చిన్న గొడ‌వ‌లు ఉన్నాయ‌ని, అవి మ‌న‌స్ప‌ర్ద‌లు దాకా రావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య కొంత‌కాలంగా మాట‌లు లేవ‌ని స‌మాచారం. త‌మ ఎంగేజ్‌మెంట్ ఇన్విటేష‌న్‌ ధ‌నుష్ ఫ్యామిలీకి కూడా త్రిష ఇచ్చింద‌ట‌. కానీ, అంద‌రినీ ఇన్‌వైట్ చేసిన వ‌రుణ్.. ధ‌నుష్‌కి మాత్రం ఇన్విటేష‌న్ ఇవ్వ‌లేదు.

అయితే, త్రిష పిలవ‌డంతో ధ‌నుష్ కుటుంబ‌తో స‌హా ఆ ఫంక్ష‌న్‌కు హాజ‌ర‌య్యాడ‌ని స‌మాచారం. దీంతో, ఇద్ద‌రి మ‌ధ్య ర‌గ‌డ మొద‌ల‌యిందని, ఎంగేజ్‌మెంట్ అయిన రాత్రే గొడ‌వ జ‌రిగింద‌ట‌. త‌న‌కు శ‌త్రువుల‌యిన వారికి ఎలా ఇన్విటేష‌న్‌లు ఇస్తావ‌ని ఆయ‌న క‌డిగిపారేశార‌ట‌. దీనికి త్రిష కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింద‌ట‌. ఇద్ద‌రి మ‌ధ్య మాటా మాటా పెర‌గ‌డంతో అది మ్యారేజ్ బ్రేకప్ దాకా చేరింద‌ని స‌మాచారం. పెళ్లికి ముందే త‌న జీవితంపై కండిష‌న్‌లు పెట్ట‌డం ఇష్టం లేని త్రిష‌.. వ‌రుణ్ మానియ‌న్‌తో కాబోయే వివాహ బంధానికి అక్క‌డే ఫుల్ స్టాప్ పెట్టింద‌ని ఆమె స‌న్నిహితులు చెబుతారు. ఇలా, త్రిష పెళ్లి.. ఎంగేజ్‌మెంట్‌కు ముందే పెటాకులు అయింద‌ని కోలీవుడ్ క‌బురు. టోట‌ల్‌గా త్రిష మ్యారేజ్ బ్రేక‌ప్ వెనుక మిస్ట‌రీ ధ‌నుష్ అని చెబుతుంటారు. ఇందులో నిజ‌మెంత అనేది వారికే తెలియాలి.

Loading...

Leave a Reply

*