కుర్రాడు మళ్లీ కొట్టేలా ఉన్నాడుగా

vijay-devarakonda

పెళ్లి చూపులుతో ఎంటైర్ టాలీవుడ్ ను ఎట్రాక్ట్ చేసిన కుర్రాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత మనోడి రేంజ్ కూడా మారిపోయింది. స్వతహాగా థియేటర్ నుంచి వచ్చాడు కాబట్టి.. యాక్టింగ్ స్కిల్స్ కు ఢోకా లేదు. పైగా అందగాడు. ఇంకేం వరుసగా వస్తున్నాయి ఆఫర్స్. లేటెస్ట్ గా మనోడు ‘ద్వారక’ అనే సినిమాలో నటిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తోంటే ఇది కూడా ప్రామిసింగ్ గానే కనిపిస్తోంది. కమెడియన్ పృథ్వీ వాయిస్ ఓవర్ తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ లో విజయ్ దొంగబాబాగా కనిపిస్తున్నాడు. కాకపోతే అతన్ని కావాలనే ఎవరో అలాంటి గెటప్ లో సెటప్ చేసినట్టు కూడా అర్థమౌతోంది. ఒక నిమిషం పాటు మామూలుగానే అనిపించినా..

మురళీశర్మ, ప్రకాష్ రాజ్ వంటి వారు ఎంట్రీ ఇస్తున్నా కొద్దీ ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. శ్రీనివాస్ రవీంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈమూవీలో పూజా ఝవేరీ హీరోయిన్ గా నటిస్తోంది. అన్నట్టు ఈ భామతో కుర్రాడు అప్పుడే ఓ లిప్ లాక్ కూడా లాగించేశాడు. చూద్దాం.. పెళ్లి చూపులుతో వచ్చిన లక్కీ హిట్ ను ఈ ద్వారక కంటిన్యూ చేస్తుందా లేదా అనేది.

Loading...

Leave a Reply

*