మహేష్ సినిమాను అప్పుడే అమ్మేశారు…

mahesh

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా షూటింగ్ ఈమద్యే ప్రారంభమైంది. ఇంకా ప్రీ-రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు. కానీ అంతలోనే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను అమ్మేసినట్టు తెలుస్తోంది. వరసుగా మహేష్ సినిమాల్ని దక్కించుకుంటున్న జీ-తెలుగు ఛానెల్.. మరోసారి అతడి సినిమాని దక్కించుకుందని చెబుతున్నారు. ఈసారి కళ్లుచెదిరే మొత్తాన్ని మహేష్ మూవీ కోసం ఆఫర్ చేసిందట జీ-తెలుగు.

మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమాని జీ-తెలుగే దక్కించుకుంది. ఆ సినిమా పెద్ద హిట్. టీవీలో కూడా అది బ్రహ్మాడంగా ఆడింది. శ్రీమంతుడు సక్సెస్ తో వెనకాముందు ఆలోచించకుండా బ్రహ్మోత్సవం సినిమాను కొనేసింది సదరు ఛానెల్. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టింది. కానీ బ్రహ్మోత్సవం సినిమా పెద్ద డిజాస్టర్ గా మారింది. టీవీల్లో కూడా చూడ్డానికి ఇష్టపడలేదు ప్రేక్షకులు. అయితే ఈ దెబ్బల్ని ఏమాత్రం పట్టించుకోకుండా… మహేష్ నెక్ట్స్ మూవీని కూడా దక్కించుకుంటోంది జీ సంస్థ.

తాజా సమాచారం ప్రకారం… మహేష్-మురుగదాస్ సినిమాను జీ-తెలుగు సంస్థ ఏకంగా 18కోట్ల 50లక్షల రూపాయలకు కొనుగోలు చేసిందట. ఈ మేరకు నిర్మాత-జీతెలుగు మధ్య ఒప్పందు కూడా కుదిరిందని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా ఆడియో ఫంక్షన్ టెలికాస్ట్ రైట్స్ ను కూడా సదరు ఛానెల్ దక్కించుకుందని తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కు ఎంత ఎమౌంట్ వస్తే అంత మొత్తం తన ఖాతాలోనే పడేట్టు… మహేష్ ముందుగానే నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నాడట.

Loading...

Leave a Reply

*