దసరా వార్ దీపావళికి షిఫ్ట్ అయింది…

untitled-9-1

మొన్న దసరాకు టాలీవుడ్ లో జరిగిన టీజర్ల యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే. దసరా రోజు పొద్దున్నే ముహూర్తం చూసుకొని మరీ బాలయ్య బాబు గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ ను విడుదల చేస్తే…. అదే రోజు సాయంత్రం ఏమాత్రం టైం గ్యాప్ లేకుండా చెర్రీ బాబు కూడా ధృవ టీజర్ విడుదల చేశాడు. ఆరోజు నుంచి ఈ క్షణం వరకు ఈ రెండు టీజర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి టీజర్ల యుద్ధమే దీపావళికి కూడా ఇంకోటి షురూ అయింది.

మరో 10 రోజుల్లో రాబోతున్న దీపావళికి మరో ఇద్దరు బడా హీరోలు లైన్ కట్టారు. వాళ్లే పవన్ కల్యాణ్, మహేష్ బాబు. వీళ్లిద్దరూ తమ సినిమాల ఫస్ట్ లుక్స్ ను దీపావళికే విడుదల చేయాలని అనుకుంటున్నారట. మహేష్ బాబు అయితే ఇప్పటికే దీపావళిని ఫిక్స్ చేసుకున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి టైటిల్ లేదా టీజర్ ను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

అయితే ఇప్పుడు రేసులోకి పవన్ కూడా ఎంటరైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ తో బిజీగా ఉన్న పవన్.. .కుదిరితే తన సినిమా ఫస్ట్ లుక్ ను దీపావళికే విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే… కాటమరాయుడు ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేయాలని కూడా అనుకుంటున్నారు. సో.. ప్రీ-రిలీజ్ బిజినెస్ బజ్ క్రియేట్ చేయాలి. అందుకే దీపావళికి ఫస్ట్ లుక్ ఇవ్వాలనుకుంటున్నారట.

Loading...

Leave a Reply

*