ఖైదీని హఠాత్తుగా కౌగిలించుకున్న డాన్సర్

chiru

ఖైదీ నంబర్ 150 సెట్స్ లో ఊహించని సంఘటన జరిగింది. దీంతో అంతా బిత్తరపోయారు. మరికొందరు భయపడ్డారు. చిరంజీవి మాత్రం లైట్ తీసుకున్నాడు. అవును.. ఓ డాన్సర్ వచ్చి చిరంజీవిని అమాంతం కౌగలించుకుంది. కానీ చిరు మాత్రం చాలా తేలిగ్గా ఈ విషయాన్ని తీసుకున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో రీసెంట్ గా 5 రోజులు ఐటెంసాంగ్ షూట్ చేసిన విషయం తెలిసిందే. లారెన్స్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనే మాస్ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి, ఐటమ్ గర్ల్ లక్ష్మీరాయ్ లు దుమ్ము దులిపేశారు.

ఈ సాంగ్ చిత్రీకరణ తాజాగా పూర్తయింది. సరిగ్గా 2 రోజుల కిందట జరిగిన ఓ చిలిపి సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ అసలు మేటర్ ఏంటంటే.. ఈ మెగా మాస్ ఐటెంసాంగ్ చిత్రీకరణ సమయంలో చిరంజీవి డాన్స్ చూసి ప్లాట్ అయిపోయిన ఓ ఫీమేల్ డాన్సర్ అక్కడికక్కడే హఠాత్తుగా చిరును గట్టిగా హత్తుకుందట. దీంతో సెట్స్ లో ఉన్నవాళ్ళంతా ఒక్క క్షణం షాక్ అయిపోయారట. తర్వాత చిరు ఎలా స్పందిస్తారోనని భయపడ్డారట.

చిరు కూడా ముందు కొంత షాక్ అయినా.. తర్వాత ఆ అమ్మాయి ఎందుకలా చేసిందో తెలుసుకున్నారట. దీనిపై వెంటనే ఆ డాన్సర్ స్పందిస్తూ.. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయస్సులోనూ ఇలా డాన్స్ చేస్తుంటే, యంగ్ స్టార్స్ డాన్స్ చేస్తున్నట్లుగానే ఉందని, అందుకే చిరును హగ్ చేసుకోవాలనిపించిందని చెప్పుకొచ్చిందట. దీంతో ఆ డాన్సర్ పొగడ్తలకు చిరు కూడా ముగ్ధుడైపోయారని తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*