మెగాస్టార్‌కి చుక్క‌లు చూపించిన సునీల్‌..!

untitled-2-copy

కామెడీ హీరో సునీల్‌..క‌మెడియ‌న్‌గా తెలుగు తెర‌పై ఎంట్రీ ఇచ్చాడు… త‌న కిత‌కిత‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు ప‌క‌ప‌క‌లు తెప్పించాడు… ఆ త‌ర్వాత సిక్స్‌ప్యాక్ చేసి హీరోగా ఎదిగాడు.. కామెడీ హీరోగా వెండితెర‌ను చించేస్తున్నాడు… మెగాస్టార్ చిరంజీవికి సునీల్ అంటే చాలా ఇష్టం… చిరంజీవి అత‌డ్ని ఎంతగానో అభిమానిస్తాడు… అలాంటి సునీల్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి హ్యాండిచ్చాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి… అస‌లు విష‌యం ఏంటంటే చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం 150 షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది…. చాలాకాలం త‌ర్వాత‌ మేక‌ప్ వేసుకుని కెమెరా ముందుకువ‌చ్చిన చిరు త‌న యాక్ష‌న్‌తో రెచ్చిపోతున్నారు… న‌ట విశ్వ‌రూపాన్నిచూపిస్తున్నారు… అయితే ఈ సినిమాలో ఓ కేర‌క్ట‌ర్‌ని సునీల్ వేస్తే బాగుంటుంద‌ని చిరంజీవికి అనిపించింది… ఆ పాత్ర వేయ‌మ‌ని సునీల్‌ని కోరారు… మెగాస్టార్ అంత‌టివాడి 150వ సినిమాలో ఆఫ‌ర్‌ అంటే ఎవ‌రైనా ఎగిరి గంతేస్తారు…

సునీల్ కూడా మొద‌ట ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు… ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ సారీ అన్న‌య్య అంటూ స‌న్నాయి నొక్కులు నొక్కాడు… తాను ఈ కేర‌క్ట‌ర్ చేయ‌లేనంటూ సినిమా ఆఫ‌ర్‌ను సున్నితంగా తిర‌స్క‌రించాడు… ఎందుక‌ని అడిగితే చాలా బిజీగా ఉన్నాను… డేట్లు అడ్జ‌స్ట్ చేయ‌లేను అని చెబుతున్నాట్ట సునీల్‌… అయితే డేట్లు అడ్జ‌స్ట్ చేయలేక చిరు సినిమా నుంచి సునీల్ త‌ప్పుకున్నాడా లేక కేర‌క్ట‌ర్ నిడివి త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల చేయ‌లేనంటూ త‌ప్పించుకున్నాడా అంటూ టాలీవుడ్ వ‌ర్గాలు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి. పాత్ర నిడివి త‌క్కువ ఉన్న కేర‌క్ట‌ర్లు చేస్తే త‌ర్వాత ఇలాంటి పాత్ర‌లు చేయ‌మ‌ని మ‌రికొంద‌రు ఒత్తిడి చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు సునీల్ భావించాడ‌ని స‌మాచారం. అంతేకాకుండా తాను హీరోగా ఉన్న టైమ్‌లో ఇలా చిన్న కేర‌క్ట‌ర్లు వేస్తే కెరీర్‌కు ఇబ్బంది క‌దా అని సునీల్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డ్డాట్ట‌…. అందేకు మెగాస్టార్ నుంచి మెగా ఆఫ‌ర్ వ‌చ్చినా ఈ కామెడీ స్టార్ హ్యాండిచ్చాట్ట‌.

Loading...

Leave a Reply

*