ఆ క‌మెడియ‌న్‌ని చూసి భ‌య‌ప‌డుతున్న సునీల్‌.. ఎవ‌రాయ‌న‌..?

sunil

సునీల్‌కి రీసెంట్‌గా స‌రైన స‌క్సెస్ లేదు. పూల‌రంగ‌డు సినిమాతో కమెడియ‌న్ వేషాల‌కు గుడ్ బై చెప్పి హీరోగా సెటిల‌య్యాడు ఈ స్టార్ క‌మెడియ‌న్.. అయితే, ఇటీవ‌ల చెప్పుకోద‌గ్గ మార్కెట్ లేక‌పోవ‌డంతో ఆయ‌న మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది. రీసెంట్‌గా ఆయ‌న న‌టించిన జ‌క్క‌న్న మిన‌హా మ‌రే సినిమా అంత‌గా ఆడలేదు. ఇటు, ఇటీవ‌ల బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఈడు గోల్డ్ ఎహే కూడా ఫ్లాప్ అయింది. దీంతో, సునీల్ క‌ష్టాలు మ‌రింత పెరిగాయి.

సునీల్ టెన్ష‌న్‌ని పెంచుతున్న మ‌రో ఎలిమెంట్… మ‌రో క‌మెడియ‌న్ వేగంగా రెయిజ్ అవడం. టాలీవుడ్‌లో క‌మెడియ‌న్‌గా అంతంత‌మాత్రంగానే ఉన్న శ్రీనివాస‌రెడ్డి హీరోగా మంచి మంచి చాన్స్‌లను పొందుతున్నాడు. రెండేళ్ల క్రితం ఆయ‌న హీరోగా న‌టించిన గీతాంజ‌లి మూవీ మంచి విజ‌యం సాధించింది. ఆ సినిమాకి భారీ లాభాలు వ‌చ్చాయి. దీంతో, క‌మెడియ‌న్‌గానూ బిజీ అయ్యాడు శ్రీనివాస‌రెడ్డి. ఇటీవ‌ల ఆయ‌న త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, సురేంద‌ర్ రెడ్డి వంటి డైరెక్ట‌ర్‌ల‌కు కంప‌ల్స‌రీగా కూడా మారాడు. ఇది శ్రీనివాస‌రెడ్డి ఇమేజ్‌ని మ‌రింత పెంచుతోంది.

ఇక‌, శ్రీనివాస‌రెడ్డి న‌టిస్తున్న తాజా చిత్రం జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా. ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు రెడీ అవుతోంది. కొత్త డైరెక్ట‌ర్ క‌నుమూరి శివ‌రాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఏకంగా రిలీజ్‌కు ముందే ఏడు కోట్ల‌కు కొనుగోలు చేశారు నిర్మాత కృష్ణారెడ్డి. సినిమా చూసి.. ఆ రేంజ్‌లో బిజినెస్ అవుతుంద‌ని భావించిన కృష్ణారెడ్డి, శ్రీనివాస రెడ్డిపై భారీ బెట్టింగ్‌కి రెడీ అయ్యాడు. ఇలా త‌క్కువ టైమ్‌లోనే షార్ప్‌గా రెయిజ్ అవుతున్నాడు శ్రీనివాస‌రెడ్డి. ఇదే సునీల్‌ని టెన్ష‌న్ పెడుతోంది. ఇటు, సునీల్ ఫుల్ లెంగ్త్ హీరోగా ఎదిగే ప్ర‌య‌త్నం చేస్తుంటే.. శ్రీనివాస రెడ్డి మాత్రం అటు కమెడియ‌న్‌గా న‌టిస్తూనే, ఇటు హీరోగా కూడా తన మార్కెట్‌ని పెంచుకుంటున్నాడు. ఇదే ఆయ‌న‌ను టెన్ష‌న్ పెడుతోంది.

Loading...

Leave a Reply

*